logo

Errabelli: కేటీఆర్‌.. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి: ఎర్రబెల్లి

ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సమర్థ్ధవంతమైన నాయకుడు,  రాష్ట్ర్రానికి కాబోయే ముఖ్యమంత్రి అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వ్యాఖ్యానించారు.

Updated : 07 Mar 2023 08:42 IST

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఎర్రబెల్లి

రాయపర్తి, న్యూస్‌టుడే: ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సమర్థ్ధవంతమైన నాయకుడు,  రాష్ట్ర్రానికి కాబోయే ముఖ్యమంత్రి అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వ్యాఖ్యానించారు. మంత్రి కేటీఆర్‌ వల్లే రాష్ట్రానికి వివిధ పరిశ్రమలు, వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయన్నారు. రాయపర్తిలో సోమవారం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. కుట్టు శిక్షణ కేంద్రాలతో మహిళలకు స్వయం ఉపాధిని కల్పిస్తున్నామన్నారు. ఈ నెల 8న తొర్రూరు పట్టణంలో నిర్వహించే సభకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఎర్రబెల్లి కోరారు. డీఆర్డీవో సంపత్‌రావు, ఎంపీపీ అనిమిరెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు కుమార్‌గౌడ్‌, ఎంపీడీవో కిషన్‌నాయక్‌, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

కేటీఆర్‌ సభ ఏర్పాట్లపై సమీక్ష

పర్వతగిరి : ఈ నెల 8న మంత్రి కేటీఆర్‌ ఏనుగల్లు గ్రామానికి వస్తున్న సందర్భంగా సభా ఏర్పాట్లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే అరూరి రమేష్‌లతో కలిసి పరిశీలించారు. హెలిప్యాడ్‌, సభా స్థలం, వాహన పార్కింగ్‌, ఇతరత్రా ఏర్పాట్లపై సోమవారం జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏనుగల్లులో ప్రతిమ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆధ్వర్యంలో క్యాన్సర్‌ వైద్య శిబిరం కార్యక్రమాన్ని కేటీఆర్‌ ప్రారంభించి సభలో ప్రసంగిస్తారని తెలిపారు. కలెక్టర్‌ గోపి, డీపీవో కల్పన, డీఆర్‌డీవో సంపత్‌రావు, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, ఇతర శాఖల అధికారులు, జడ్పీటీసీ సభ్యుడు సింగులాల్‌, మాజీ ఏఎంసీ ఛైర్మన్‌ నారాయణరావు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని