logo

దేశాయిపేట ఆరోగ్య కేంద్రానికి జాతీయ గుర్తింపు

ఏటా ఇచ్చే జాతీయ నాణ్యత హామీ ప్రమాణాల గుర్తింపు(నేషనల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ స్టాండర్డ్స్‌) ఈసారి ఉమ్మడి జిల్లాలో వరంగల్‌ దేశాయిపేట పట్టణ ఆరోగ్య కేంద్రానికి దక్కింది.

Published : 21 Mar 2023 04:15 IST

పట్టణ ఆరోగ్య కేంద్రం ఎదుట వైద్యులు, సిబ్బంది

ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే: ఏటా ఇచ్చే జాతీయ నాణ్యత హామీ ప్రమాణాల గుర్తింపు(నేషనల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ స్టాండర్డ్స్‌) ఈసారి ఉమ్మడి జిల్లాలో వరంగల్‌ దేశాయిపేట పట్టణ ఆరోగ్య కేంద్రానికి దక్కింది. ప్రపంచంలోనే ఉత్తమ సేవలందించే ఆసుపత్రులుగా తయారు చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆరోగ్య మండలి ద్వారా ఈ జాతీయ నాణ్యతా హామీ ప్రమాణాల పత్రాలను ఇస్తున్నారు. ఈసంవత్సరం జనవరి మాసంలో దిల్లీ నుంచి వచ్చిన నేషనల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ స్టాండర్డ్స్‌ బృందం పరిశీలనలో దేశాయిపేట పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని గుర్తిస్తూ ఆదివారం సాయంత్రం జాతీయ ఆరోగ్య మండలి జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఆసుపత్రి భవనం, దానికి రంగు, గేటు, రోగులు కూర్చోవడానికి కుర్చీలు, డస్టుబిన్‌, మరుగుదొడ్లు, తాగునీరు, ఆసుపత్రిలోని ఫార్మసీ గది, వైద్యుడి గది, అత్యవసర ప్రసూతి గది, వైద్యుడి పనితీరు, సిబ్బంది రోగులతో మాట్లాడేతీరు, రికార్డుల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, గ్రీనరీ, స్వచ్ఛభారత్‌ వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న కేంద్ర బృందం 100 మార్కుల స్కోరుకు గానూ దేశాయిపేట పట్టణ ఆరోగ్య కేంద్రం 90.4 శాతం మార్కులు ఇచ్చింది. ఈ గుర్తింపు సర్టిఫికెట్‌తోపాటు కేంద్ర జాతీయ ఆరోగ్య మండలి నుంచి మూడేళ్లపాటు ప్రతి సంవత్సరం రూ.2 లక్షల ప్రోత్సాహకం అందిస్తారని డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటరమణ తెలిపారు. ఈ గుర్తింపుతో రోగులకు మెరుగైన ఉత్తమ సేవలు అందుతాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు