logo

నాడు ఆనందం.. నేడు విషాదం!

వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం ధర్మారావుపేటకు చెందిన కన్నెబోయిన చిరంజీవి రెండెకరాల్లో వరి, ఎకరం పుచ్చ, ఒకటిన్నర ఎకరంలో మిరప పంటలు సాగుచేశారు.

Published : 21 Mar 2023 04:15 IST

మార్కెట్‌లో ఎక్కువ ధర పలికిన మిర్చితో సెల్ఫీ తీసుకుంటున్న రైతు చిరంజీవి

న్యూస్‌టుడే, ఎనుమాముల మార్కెట్‌: వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం ధర్మారావుపేటకు చెందిన కన్నెబోయిన చిరంజీవి రెండెకరాల్లో వరి, ఎకరం పుచ్చ, ఒకటిన్నర ఎకరంలో మిరప పంటలు సాగుచేశారు. తొలికాతలో వచ్చిన 41 బస్తాల తేజ మిర్చిని ఈ నెల 16న వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు తీసుకురాగా క్వింటాకు రికార్డు ధర రూ.23,500 పలికింది. ఎగిరి గంతేసిన చిరంజీవి మార్కెట్‌కు తీసుకొచ్చిన పంటతో దిగిన స్వీయ చిత్రాలను దోస్తులతో పంచుకున్నారు. ఆ రైతు ఆనందాన్ని ఆదివారం తెల్లవారుజామున కురిసిన వడగండ్ల వాన చిదిమేసింది. రూ.1.50 లక్షలు విలువచేసే మిర్చి, రూ.లక్ష విలువైన వరి, పుచ్చపంటలను నాశనం చేసిందని కన్నీటిపర్యంతమయ్యారు. పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించాలని ఆయన వేడుకొంటున్నారు.

వడగండ్ల వానకు ఆయన చేలో నేలరాలిన మిరపకాయలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని