logo

నెల రోజులైనా రాని స్పష్టత!

కాకతీయ వైద్య కళాశాల పీజీ విద్యార్థిని ధారావత్‌ ప్రీతి కేసు నెల రోజులైనా కొలిక్కి రావడం లేదు. పోలీసులకు ఇది పెద్ద సవాలుగా మారింది.

Published : 21 Mar 2023 03:54 IST

ప్రీతి మృతి కేసులో పలు కోణాల్లో విచారణ

ఈనాడు, వరంగల్‌: కాకతీయ వైద్య కళాశాల పీజీ విద్యార్థిని ధారావత్‌ ప్రీతి కేసు నెల రోజులైనా కొలిక్కి రావడం లేదు. పోలీసులకు ఇది పెద్ద సవాలుగా మారింది. సీనియర్‌ విద్యార్థి సైఫ్‌ వల్ల ర్యాగింగ్‌కు గురైన ప్రీతి గత నెల 22న ఎంజీఎంలో అపస్మారక స్థితిలో పడి ఉండడం, తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఫిబ్రవరి 26న మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ప్రీతి మృతిపై ఇప్పటికే అనేక సందేహాలకు సమాధానం దొరకడం లేదు. ర్యాగింగ్‌ తట్టుకోలేక ఆమె హానికరమైన ఇంజెక్షన్‌ తీసుకొని ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిందా? లేక వేధింపులు భరించలేక తీవ్ర మనస్తాపానికి గురై గుండెపోటు లాంటిది వచ్చి కుప్పకూలడం వల్ల ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించిందా అనే దానిపై ఇప్పటికీ స్పష్టత రాకపోవడం గమనార్హం. ఈ కేసును పోలీసులు ముమ్మరంగా విచారిస్తున్నారు. నిందితుడు సైఫ్‌ను నాలుగు రోజుల పాటు కస్టడీకి తీసుకొని అనేక కోణాల్లో ప్రశ్నించారు. ప్రీతి చరవాణిలో ఉన్న చాటింగ్‌లను వెలికి తీసి పలు కోణాల్లో విచారిస్తున్నారు. కమిషనర్‌ రంగనాథ్‌ సైతం స్వయంగా రంగంలోకి దిగి పలుమార్లు కేఎంసీకి వెళ్లి అక్కడి వైద్యులు, ఎంజీఎంకు వెళ్లి అక్కడి నర్సులు ఇతర సిబ్బందితో మాట్లాడారు.  
ః తాజాగా పోలీసులు ప్రీతి స్నేహితుల్లో ఒకరిని కూడా పలు కోణాల్లో విచారించినట్టు సమాచారం. అతని సెల్‌ఫోన్‌ను నాలుగైదు రోజులు తమ వద్దే పెట్టుకొని ఆరా తీసినట్టు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని