logo

హిమాన్షికి ‘యంగ్‌ అచీవర్‌ ఆఫ్‌ తెలంగాణ’ పురస్కారం

 కూచిపూడి నృత్యకారిణి హిమాన్షి సోమవారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ చేతుల మీదుగా ‘యంగ్‌ అచీవర్‌ ఆఫ్‌ తెలంగాణ’ పురస్కారం అందుకున్నారు.

Published : 21 Mar 2023 04:15 IST

వరంగల్‌ సాంస్కృతికం, న్యూస్‌టుడే:  కూచిపూడి నృత్యకారిణి హిమాన్షి సోమవారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ చేతుల మీదుగా ‘యంగ్‌ అచీవర్‌ ఆఫ్‌ తెలంగాణ’ పురస్కారం అందుకున్నారు. రాజ్‌ భవన్‌లో జరిగిన ఉగాది ఉత్సవాల్లో వివిధ రంగాల్లో నిష్ణాతులకు పురస్కారాలు అందించగా నృత్య విభాగంలో హిమాన్షి అవార్డు తీసుకున్నారు.

ఫణికాంత్‌కు యువశాస్త్రవేత్త...

కేయూ క్యాంపస్‌, న్యూస్‌టుడే: కాకతీయ విశ్వవిద్యాలయం బయోటెక్నాలజీకి చెందిన పరిశోధకుడు డాక్టర్‌ జె.ఫణికాంత్‌కు యువశాస్త్ర పురస్కారం లభించింది. తెలంగాణ రాష్ట్ర అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ వారు ఈ అవార్డును ప్రకటించారు. రూ.10 వేల నగదుతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేస్తారని ఫణికాంత్‌ వివరించారు.

సైన్స్‌ అకాడమీ  సభ్యుడిగా నాగయ్య

కేయూ క్యాంపస్‌: తెలంగాణ అకాడమీ ఆఫ్‌ సైన్స్‌ అసోసియేట్‌ సభ్యుడిగా కేయూలోని గణిత విభాగం ఒప్పంద సహాయ ఆచార్యులు డా.సి.నాగయ్య ఎంపికయ్యారు. ఈ  మేరకు తెలంగాణ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నాగయ్యను కేయూ ఉపకులపతి రమేష్‌, రిజిస్ట్రార్‌ శ్రీనివాసరావు అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని