logo

వ్యవసాయ మార్కెట్‌ పాలకమండలి ప్రమాణస్వీకారం

జనగామలోని మార్కెట్‌యార్డులో సోమవారం వ్యవసాయ విపణి కొత్త పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు.  

Published : 21 Mar 2023 04:15 IST

ఎమ్మెల్యేలు యాదగిరిరెడ్డి, రాజయ్యల సమక్షంలో మార్కెట్‌ కమిటీ అధ్యక్షుడు సిద్ధిలింగంతో ప్రమాణస్వీకారం చేయిస్తున్న జిల్లా అధికారి నాగేశ్వరశర్మ

జనగామ, న్యూస్‌టుడే: జనగామలోని మార్కెట్‌యార్డులో సోమవారం వ్యవసాయ విపణి కొత్త పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు.  జడ్పీ ఛైర్మన్‌ పి.సంపత్‌రెడ్డి, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌ శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రాజయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా మార్కెటింగ్‌ అధికారి నాగేశ్వరశర్మ.. జనగామ మండలం పెంబర్తికి చెందిన పాలకవర్గం అధ్యక్షుడు బాల్దె సిద్ధిలింగం, రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరికి చెందిన ఉపాధ్యక్షుడు ముసిపట్ల విజయ్‌కుమార్‌లతో ప్రమాణ స్వీకారం చేయించారు. డైరెక్టర్లు  మాలరాజు, శివరాత్రి రాజ్‌కుమార్‌, నూనెముంతల యాకస్వామి, బస్వగాని బాలమల్లేశ్‌, సేవెల్లి మధుసూదన్‌, గువ్వలరవి, బుషిగంపల ఆంజనేయులు, ధర్మ జయప్రకాశ్‌రెడ్డి, అజ్మీరా మంగమ్మ, సూదగాని సంజీవ, మాశెట్టి వెంకటేశ్వర్లు, మాశెట్టి అశోక్‌లతో పాటు మార్కెటింగ్‌ జిల్లా అధికారి నాగేశ్వరశర్మ, జనగామ పీఏసీఎస్‌ ఛైర్మన్‌ మహేందర్‌రెడ్డి, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పి.జమున ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం అనంతరం కమిటీ అధ్యక్షుడు సిద్ధిలింగం రిజిస్టర్‌లో సంతకాలు చేసి బాధ్యతలు స్వీకరించారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహం నుంచి మార్కెట్‌ వరకు ఒగ్గు కళాకారులు, బోనాలు, కోలాటం కళాకారుల బృందాల ఆట, పాటలు, బాణసంచా పేలుళ్లతో ఊరేగింపు నిర్వహించారు. సిద్ధిలింగం, విజయ్‌కుమార్‌, ఇతర డైరెక్టర్లను ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జీవన్‌కుమార్‌ సన్మానించారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, కురుమ సంఘం రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశం మార్కెట్‌ మాజీ ఛైర్‌పర్సన్లు బాల్దె విజయ, బండ పద్మ, కాయితాపురం మహేందర్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యులు మణికంఠ, మారపాక రవి, మాలోతు శ్రీనివాస్‌, దీపిక, సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు బొల్లం శారద, అడ్తీదారుల సంఘాల నాయకులు, హమాలీ, దడువాయి, మార్కెట్‌ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. *తెలంగాణ మాదిరిగా అన్ని రాష్ట్రాలను అభివృద్ధి చేసేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ భారాసను స్థాపించారని జడ్పీ ఛైర్మన్‌ పి.సంపత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు యాదగిరిరెడ్డి, రాజయ్య అన్నారు. కేసీఆర్‌కు ప్రజలు అండగా నిలిచి కాపాడుకోవాలని కోరారు. జడ్పీఛైర్మన్‌ మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి మాట్లాడుతూ మార్కెట్‌ అభివృద్ధికి కొత్త కార్యవర్గం పాటు పడాలన్నారు. మార్కెట్‌ కమిటీ అధ్యక్షుడు బాల్దె సిద్ధిలింగం మాట్లాడుతూ  రైతులకు సేవలందించేందుకు తమ కమిటీ నిరంతరం శ్రమిస్తుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని