logo

ప్రశ్నపత్రాల లీకేజీపై విచారణ చేపట్టాలి

టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహరంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Published : 21 Mar 2023 04:15 IST

కాజీపేటలో రాస్తారోకో చేస్తున్న కాంగ్రెస్‌ శ్రేణులు

కాజీపేట టౌన్‌, న్యూస్‌టుడే: టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహరంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ విషయమై మంత్రి కేటీఆర్‌ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కోరుతూ సోమవారం కాజీపేట ప్రధాన రహదారిపై కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న నాయిని మాట్లాడుతూ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో రాజకీయ నాయకులు సభ్యులుగా ఎలా నియమిస్తారని, ప్రభుత్వ వైఫల్యం వల్లే ప్రశ్నపత్రం లీకేజీ జరిగిందన్నారు. ఈనెల 23న మంత్రి కేటీఆర్‌ పర్యటనను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ధర్నాతో రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు వచ్చి నేతలను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కార్పొరేటర్లు వెంకన్న, శ్రీమాన్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మహ్మద్‌ అంకూస్‌, షేక్‌ అజ్గర్‌, ఇప్ప శ్రీకాంత్‌, శివ, కృష్ణ, మానస, మధు, విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

నిరసన దీక్షలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే భిక్షపతి

భాజపా నిరసన దీక్ష

పరకాల, న్యూస్‌టుడే: టీఎస్‌పీఎస్సీ పోటీ పరీక్ష పత్రాల లీకేజీని నిరసిస్తూ సోమవారం పరకాలలో భాజపా నాయకులు నల్ల రిబ్బన్లతో నిరసన దీక్ష నిర్వహించారు. ఎం.రతన్‌కుమార్‌ అధ్యక్షతన సాగిన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి హాజరై మాట్లాడారు. డాక్టర్‌ పి.విజయచందర్‌రెడ్డి, కె.గురుప్రసాద్‌, జి.సత్యనారాయణరావు, ఎం.ప్రసాద్‌, డి.మేఘనాథ్‌, ఆర్‌పీ.జయంత్‌లాల్‌, రామన్న, గురిజాల శ్రీరాంరెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని