logo

విన్నవించాం.. పరిష్కరించండి..!

సమస్యలను పరిష్కరించాలని సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో జిల్లా నలుమూలల నుంచి నుంచి వచ్చిన ప్రజలు కలెక్టర్‌ కృష్ణ ఆదిత్యకు వినతులు సమర్పించారు.

Published : 21 Mar 2023 04:24 IST

ఫిర్యాదులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య

ములుగు, న్యూస్‌టుడే: సమస్యలను పరిష్కరించాలని సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో జిల్లా నలుమూలల నుంచి నుంచి వచ్చిన ప్రజలు కలెక్టర్‌ కృష్ణ ఆదిత్యకు వినతులు సమర్పించారు. కలెక్టర్‌ ఫిర్యాదులు స్వీకరించి కొన్నింటిని తక్షణమే పరిష్కరించారు. మరికొన్నింటిని ఇతర శాఖల అధికారులకు సిఫారసు చేశారు. ఎలాంటి జాప్యం లేకుండా అర్జీలను పరిష్కరించాలని, తిరస్కరణకు గురైతే కారణాలను ఫిర్యాదుదారులకు చెప్పాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో మొత్తం 36 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

* ములుగు మండలం పులిగుండం గ్రామానికి చెందిన బూక్క లక్ష్మి పట్టాదారు పాసు పుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్నారు.
* ములుగు జంగాపల్లికి చెందిన జాడి ప్రశాంతి భూ సమస్యను పరిష్కరించాలని అర్జీ ఇచ్చారు.
* కాసిందేవిపేటకు చెందిన డి.పురుషోత్తమ రావు పట్టాదారు పాసు పుస్తకం ఇప్పించాలని కలెక్టర్‌ను కోరారు.
* ములుగు బండారుపల్లికి చెందిన జె.ప్రమీల భూ సమస్యను పరిష్కరించాలని విన్నవించారు.
* మంగపేట మండలం రామచంద్రునిపేటకు చెందిన రాంబాబు రాజుపేట కెనరా బ్యాంకు రూ.లక్ష రుణం మంజూరు చేసినా నగదు విడుదల చేయడం లేదని పిర్యాదు చేశారు.

దరఖాస్తుల వివరాలు

ప్రజావాణిలో వచ్చిన మొత్తం ఫిర్యాదులు : 36
రెవెన్యూ : 15
జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ: 7
రెండు పడక గదుల ఇళ్లు: 5
ఆసరా పింఛన్‌ : 5
ఇతర సమస్యలు: 4


ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి

- ప్రశాంత్‌, ఇంచర్ల, ములుగు

ఇంచెర్ల గ్రామ శివారులో ఉన్న మా భూమిని ఇతరులు ఆక్రమించుకున్నారు. ఆ భూమిని ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా మా తాతకు ఇచ్చారు. ఇప్పుడు ఇతరులు దాన్ని ఆక్రమించుకున్నారు. వారిపై చర్య తీసుకోవాలి.


మూడు నెలలుగా పింఛన్‌ నిలిపివేశారు 

- బి.రజిత, అడవి రాంగాపురం, వెంకటాపూర్‌

మూడేళ్లుగా వికలాంగుల పింఛన్‌ ఇసున్నారు. సదరం ధ్రువీకరణ పత్రాన్ని రెన్యూవల్‌ చేసుకోలేదని మూడు నెలలుగా పింఛన్‌ రావడం లేదు. ఈ నెల 19 వరకే మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని గడువు విధించారు. సమయం ముగియడంతో.. దరఖాస్తు చేసుకోలేదు. అధికారులు చొరవ తీసుకొని పింఛన్‌ ఇప్పించాలి.


ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదు

- సీహెచ్‌ రమాదేవి: నర్సాపూర్‌, వెంకటాపూర్‌ మండలం

నర్సాపూర్‌ శివారులో మాకు 6.18 ఎకరాల భూమి ఉంది. నా భర్త పేరున 3.9 ఎకరాలు ఉంది. ఆ భూమిని ఇతరులు పట్టాచేయించుకున్నారు. ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. మా భూమికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇప్పించి ఆదుకోవాలి.


నిర్మాణాన్ని ఆపాలి

- పరిపూర్ణాచారి, ములుగు

1993 సంవత్సరం నుంచి ఒక గదిలో దుకాణం నడుపుతున్నాను. కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం దుకాణాన్ని మూసివేశాను. ఆ స్థలంలో గ్రామ పంచాయతీ వారు మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. అడిగితే స్పందించడం లేదు. నిర్మాణాన్ని ఆపే విధంగా చర్యలు తీసుకోవాలి.


ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ

అర్జీ స్వీకరిస్తున్న పీవో అంకిత్‌

ఏటూరునాగారం, న్యూస్‌టుడే: ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో తమ సమస్యలు పరిష్కరించాల్సిందిగా కోరుతూ పీవో అంకిత్‌కు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనులు అర్జీలు సమర్పించారు. ఫిర్యాదులు స్వీకరించిన పీవో తక్షణమే అర్జీలను పరిష్కరించాలన్నారు. ప్రజావాణిలో ఎక్కువగా భూసంబంధిత సమస్యలు వచ్చాయి. దరఖాస్తులను పరిష్కరించడంతో నిర్లక్ష్యం చేయకూడదని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీవో వసంతరావు, ఎస్‌వో రాజ్‌కుమార్‌, ఏవో రఘు, మేనేజర్‌ శ్రీనివాస్‌, ఈఈ హేమలత, పీహెచ్‌వో రమణ, భారతి, డిప్యూటీడీఎంహెచ్‌వో క్రాంతికుమార్‌, జీసీసీ డీఎం ప్రతాప్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని