31న వరంగల్ ‘బార్’ ఎన్నికలు
వరంగల్ జిల్లా న్యాయవాదుల సంఘం ఎన్నికలు ఈ నెల 31న జరగనున్నాయి. దాదాపు 70 ఏళ్ల చరిత్ర కలిగిన వరంగల్ బార్ అసోసియేషన్, హనుమకొండ జిల్లా బార్ అసోసియేషన్‌గా విడిపోయిన విషయం తెలిసిందే.
వరంగల్ న్యాయవిభాగం, న్యూస్‌టుడే: వరంగల్ జిల్లా న్యాయవాదుల సంఘం ఎన్నికలు ఈ నెల 31న జరగనున్నాయి. దాదాపు 70 ఏళ్ల చరిత్ర కలిగిన వరంగల్ బార్ అసోసియేషన్, హనుమకొండ జిల్లా బార్ అసోసియేషన్‌గా విడిపోయిన విషయం తెలిసిందే. హనుమకొండ జిల్లా బార్ అసోసియేషన్‌కు ఇటీవల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన విషయం విదితమే. ఇటీవల జరిగిన సర్వసభ్య సమావేశంలో వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్‌కు ఎన్నిక నిర్వహణకు ముగ్గురు న్యాయవాదులు చంద్రపాటి చిదంబర్‌నాద్, తాబేటి శ్రీదర్, వి.లలితకుమారితో కమిటీని నియమించింది. వీరు గురువారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. 723 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
* 23న న్యాయవాదుల సభ్యుల జాబితా విడుదల.
* 24న ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొత్త బార్(అంబేద్కర్) అసోసియేషన్ హాల్లో నామినేషన్ల స్వీకరణ.
* 25న ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ. తరువాత ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల పూర్తి జాబితా విడుదల.
* 28న నూతన బార్ అసోసియేషన్ హాల్లో మధ్యాహ్నం 2 నుంచి అభ్యర్థుల పరిచయ కార్యక్రమం.
* 31న నూతన బార్ అసోసియేషన్ హాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు. ఆరు గంటల నుంచి ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాల వెల్లడి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
బ్యాటింగ్ ఎంచుకోవాల్సింది: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
World News
భారతీయులకు వీసాల మంజూరులో జాప్యమేల?
-
Crime News
ప్రియుడి మర్మాంగం కోసిన యువతి
-
Ts-top-news News
భారత్‌లో మహిళలకు బైపాస్ సర్జరీ అనంతర ముప్పు తక్కువే!
-
Ap-top-news News
తిరుమల గగనతలంలో విమానాలు
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (09/06/2023)