logo

సమాచారం అడిగిందొకరు.. సమాధానం ఇచ్చింది మరొకరికి!!

ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచుతూ అవినీతి రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడం కోసం ఏర్పడినదే సమాచార హక్కు చట్టం.

Published : 24 Mar 2023 03:54 IST

న్యూస్‌టుడే, హనుమకొండ కలెక్టరేట్‌: ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచుతూ అవినీతి రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడం కోసం ఏర్పడినదే సమాచార హక్కు చట్టం. ఈ చట్టాన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అమలు చేయాలి. కానీ కొందరు అధికారులు అమలు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండకు చెందిన వల్లెపు శ్రీనివాస్‌ ఫిబ్రవరి 15న కాజీపేట మండలంలోని ఆర్‌సీఆర్‌. ఆర్‌ఓఆర్‌, జమాబంధీ, తదితర రికార్డు పత్రాలు ఇవ్వాలని కోరుతూ హనుమకొండ కలెక్టరేట్‌లోని భూములు, కొలతలు, రికార్డుల శాఖకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. 30 రోజుల్లోగా పూర్తి సమాచారం ఇవ్వాలి. కానీ ఇక్కడే అధికారులు తప్పులో కాలు వేశారు. సమాచారం అడిగిన శ్రీనివాస్‌కు కాకుండా ఊరు, పేరుతో సంబంధం లేని శ్రీనాథ్‌ అనే వ్యక్తికి పోస్ట్‌ ద్వారా సమాచారం చేరవేశారు. శ్రీనివాస్‌ తన దరఖాస్తుకు సమాధానం రాలేదని గురువారం కార్యాలయానికి వచ్చి సంప్రదిస్తే.. వివరాలన్నీ పంపామని చెప్పారు. అతను ఆరా  తీస్తే శ్రీనాథ్‌కు పంపినట్లు తేలింది. గడువులోగా సమాచారం ఇవ్వకపోవడమే కాకుండా, ఆ లేఖలో సగం వివరాలు మాత్రమే లభిస్తాయని, మిగతా వివరాలు దొరకవని పేర్కొనడం గమనార్హం. ఈ విషయమై సర్వే ల్యాండ్‌ రికార్డ్సు ఏడీ ప్రభాకర్‌ను వివరణ కోరడానికి ‘న్యూస్‌టుడే’ ఫోన్‌ చేస్తే స్పందించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని