logo

తొలి ప్రయత్నంలోనే న్యాయమూర్తి కొలువు

ఉమ్మడి జిల్లా నుంచి ఏకైక వ్యక్తిగా మొదటి ప్రయత్నంలోనే న్యాయమూర్తి కొలువు సాధించారు నల్లాల వెంకట్‌ సచిన్‌రెడ్డి.

Published : 24 Mar 2023 04:09 IST

న్యాయవాదులైన తల్లిదండ్రులతో వెంకట్‌ సచిన్‌రెడ్డి

వరంగల్‌ న్యాయవిభాగం, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లా నుంచి ఏకైక వ్యక్తిగా మొదటి ప్రయత్నంలోనే న్యాయమూర్తి కొలువు సాధించారు నల్లాల వెంకట్‌ సచిన్‌రెడ్డి. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన 41 మంది జూనియర్‌ సివిల్‌ జడ్జిల పోస్టుల భర్తీకి గాను 39 మందిని ఎంపిక చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్‌(నియామక) గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఉమ్మడి జిల్లా నుంచి వెంకట్‌ సచిన్‌రెడ్డి ఒక్కరే ఉన్నారు. జిల్లా కోర్టులో న్యాయవాదులుగా సాధన చేస్తున్న నల్లాల రాంరెడ్డి, అరుణ దంపతుల కుమారుడు ఈయన. వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం జల్లి గ్రామానికి చెందిన సచిన్‌రెడ్డి 2013 నుంచి 2017 వరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏఎల్‌ యూనివర్సిటీలో బీటెక్‌ చదివారు. 2017 నుంచి 2020 వరకు హనుమకొండ నగరంలోని ఆదర్శ న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. అప్పటినుంచి న్యాయవాదిగా పనిచేస్తూ తమ తల్లిదండ్రుల వద్ద, గురువుల వద్ద శిక్షణ తీసుకొని మొదటి ప్రయత్నంలోనే న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. సచిన్‌రెడ్డి ఎంపికపై బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, సీనియర్‌, జూనియర్‌ న్యాయవాదులు, బంధుమిత్రులు హర్షం వెలిబుచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు