‘భద్రకాళి’కి లక్ష పుష్పార్చన
వసంత నవరాత్ర మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు శ్రీ భద్రకాళి అమ్మవారికి కాగడా మల్లె పూలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు.
వసంత నవరాత్ర మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు శ్రీ భద్రకాళి అమ్మవారికి కాగడా మల్లె పూలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. గురువారం ఉదయం ప్రధానార్చకుడు శేషు ఆధ్వర్యంలో సుప్రభాత సేవ, నిత్యాహ్నికం, నవరాత్ర ఉత్సవం జపహోమార్చనాభిషేకాలు నిర్వహించారు. అనంతరం భద్రకాళి దేవస్థానం వేద విద్యార్థులు, వేద పండితులు, అర్చకుల మంత్రోచ్ఛారణలతో అమ్మవారికి కాగడా మల్లె పూల(కాశీ మల్లెలు)తో పుష్పార్చన చేశారు. భద్రకాళి దేవాలయంలోని శ్రీ వీరాంజనేయస్వామి దేవాలయంలో ఆరాధన నిమిత్తం హైదరాబాద్ ఉప్పల్ రామాలయం వంశపారంపర్య ధర్మకర్త వేనాతుకూరి రాఘవదాస్ హనుమంతుడు, లక్ష్మణుడు, సీతా సమేత రామచంద్రస్వామి పంచలోహమూర్తులను బహూకరించారు. ప్రతిష్ఠాపన పూజలు వైభవంగా నిర్వహించారు.
రంగంపేట, న్యూస్‌టుడే
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
Sports News
బ్యాటింగ్ ఎంచుకోవాల్సింది: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
World News
భారతీయులకు వీసాల మంజూరులో జాప్యమేల?
-
Crime News
ప్రియుడి మర్మాంగం కోసిన యువతి
-
Ts-top-news News
భారత్లో మహిళలకు బైపాస్ సర్జరీ అనంతర ముప్పు తక్కువే!
-
Ap-top-news News
తిరుమల గగనతలంలో విమానాలు