logo

ప్రమాదకరంగా రాఘవపట్నం అప్రోచ్‌ రోడ్డు

గోవిందరావుపేట మండలం రాఘవపట్నం గ్రామ పొలిమేరలోని దయ్యాలవాగు వంతెన అప్రోచ్‌రోడ్డు కోతకు గురై ప్రమాదకరంగా మారింది. గతంలో ఏటూరునాగారం ఐటీడీఏ ఆధ్వర్యంలో అధికారులు దయ్యాలవాగుపై వంతెన నిర్మించారు.

Published : 24 Mar 2023 04:25 IST

గోవిందరావుపేట మండలం రాఘవపట్నం గ్రామ పొలిమేరలోని దయ్యాలవాగు వంతెన అప్రోచ్‌రోడ్డు కోతకు గురై ప్రమాదకరంగా మారింది. గతంలో ఏటూరునాగారం ఐటీడీఏ ఆధ్వర్యంలో అధికారులు దయ్యాలవాగుపై వంతెన నిర్మించారు. సుధీర్ఘ కాలం వంతెన నిర్మాణం పడుతూ లేస్తూ సాగింది. ఎట్టకేలకు గుత్తేదారు పనులు పూర్తి చేశారు. అయితే అప్రోచ్‌ రోడ్డు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. వంతెనకు రెండు వైపులా మట్టి పోసి రివిట్‌మెంట్‌ నిర్మించకుండా వదిలేశారు. దీంతో ప్రతి సంవత్సరం వర్షాలకు మట్టి క్రమంగా కొట్టుకుపోతూ ప్రమాదకరంగా పరిణమించింది. వంతెనకు రెండు వైపులా శ్లాబ్‌ అంచుల వద్ద కూడా మట్టి కోతకు గురైంది. గతంలో ఒకసారి భారీ వర్షాలు కురిసినప్పుడు వంతెనకు ఒక వైపు అప్రోచ్‌ రోడ్డు కోతకు గురై రాకపోకలు నిలిచిపోయాయి. ఆ సమయంలో పంచాయతీ ఆధ్వర్యంలో గండిని పూడ్చారు. వర్షాలు పడ్డప్పుడల్లా వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. మేడారం జాతర సమయంలో, ట్రాఫిక్‌ సమస్య తలెత్తినప్పుడు వాహనాల మళ్లింపునకు ఈ మార్గం ఎంతో ఉపయోగపడుతోంది. ఇంతటి ప్రాధాన్యమున్నప్పటికీ మరమ్మతులు చేపట్టడం లేదు. వర్షాకాల రాక ముందే సంబంధిత అధికారులు అప్రోచ్‌ రోడ్డును బాగు చేసి ఇబ్బందులు తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.

న్యూస్‌టుడే, గోవిందరావుపేట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని