logo

పదిలో ఉత్తమ ఫలితాల సాధనకు ‘పంచ సూత్రాలు’

త్వరలో జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఆరు పేపర్ల విధానం అమలు కానుంది. ఇందుకోసం ఉపాధ్యాయులు,  విద్యార్థులు శ్రమిస్తున్నారు.

Published : 24 Mar 2023 04:46 IST

కోలుకొండ పాఠశాలలో ధ్యానం చేస్తున్న విద్యార్థులు

దేవరుప్పుల (జనగామ జిల్లా), న్యూస్‌టుడే: త్వరలో జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఆరు పేపర్ల విధానం అమలు కానుంది. ఇందుకోసం ఉపాధ్యాయులు,  విద్యార్థులు శ్రమిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో మనోవిజ్ఞాన నిపుణులు చెప్పిన సూత్రాలను అమలు చేస్తున్నారు. జనగామ మండలం గానుగపహాడ్‌లోని ఉన్నతపాఠశాల ఉపాధ్యాయులు.. ఎవరి స్వరం వారికి సుమధురంగా ఉంటుందని భావించారు. కంఠతా రాని ఆంగ్ల పద్యాలను విద్యార్థులతో చదివించి వారి చరవాణుల్లో రికార్డు చేయిస్తున్నారు. తీరిక సమయాల్లో విద్యార్థులు ఆ పద్యాలను వినేలా శాస్త్రీయ ప్రయోగాన్ని అమలు చేస్తున్నారు. ఇలా తరచూ వింటుంటే కంఠతా వస్తాయని శాస్త్రీయ ప్రయోగాలు నిరూపించాయి. పెద్దమడూరు ఉన్నత పాఠశాలలో ప్రహరీ గోడతో పాటు తరగతి గది గోడలపై అన్ని తరగతుల పాఠ్యాంశాలకు సంబంధించిన చిత్రాలు  కనువిందు చేస్తున్నాయి. తమకు సరిగ్గా జ్ఞాపకం లేని విషయాల బొమ్మలను విద్యార్థులు తరచూ చూడడంతో మనసులో స్థిరంగా ఉంటుందని, విద్యార్థులు వాటిని చూడాలని పురమాయిస్తున్నారు. పాలకుర్తి ఉన్నత పాఠశాలలో చేతిరాతకు అధిక ప్రాధాన్యమిస్తూ రోజుకు అరగంట సేపు తెలుగు అంగ్ల భాష అక్షరాలను దిద్దిస్తున్నారు.  

కోలుకొండ పాఠశాలలో విద్యార్థులతో రోజూ కొంత సేపు ధ్యానం చేయిస్తున్నారు. నీర్మాలలోని ఉన్నతపాఠశాలలో గోడపత్రికలు, చిత్రాలతో విద్యార్థులకు తెలుగుకవులు, వారి రచనల గురించి వివరిస్తున్నారు. ఈ విధానం సత్ఫలితాలిస్తోందని ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని