logo

ప్రభుత్వ స్థలంపై కన్ను

వరంగల్‌ ప్రాంతం హంటర్‌రోడ్‌ ఎన్టీఆర్‌ నగర్‌లోని ప్రభుత్వ స్థలంపై ప్రైవేటు వ్యక్తులు కన్నేశారు. 

Published : 27 Mar 2023 06:04 IST

హంటర్‌రోడ్‌ ఎన్టీఆర్‌ నగర్‌లో ప్రభుత్వ స్థలం

రామన్నపేట, న్యూస్‌టుడే: వరంగల్‌ ప్రాంతం హంటర్‌రోడ్‌ ఎన్టీఆర్‌ నగర్‌లోని ప్రభుత్వ స్థలంపై ప్రైవేటు వ్యక్తులు కన్నేశారు.  1997-98లో భద్రకాళి చెరువు దిగువున ప్రభుత్వ స్థలాన్ని వీకర్‌ సెక్షన్‌ లేఅవుటు కాలనీ చేశారు. 60- 70 మంది దారిద్య్రరేఖకు దిగువున ఉన్నవారికి పట్టాలు పంపిణీ చేశారు. ఇక్కడ ఉన్న పార్కు, లేఅవుటు ఖాళీ స్థలాలపై  ప్రైవేటు వ్యక్తులు కన్నేశారు. నాలుగైదేళ్లుగా ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు స్థలాన్ని సొంతం చేసుకునే యత్నాలను స్థానికులు అడ్డుకున్నారు. ఆదివారం ఉదయం ముగ్గురు ప్రైవేటు వ్యక్తులొచ్చి డోజర్‌తో స్థలాన్ని చదును చేస్తుండగా స్థానిక ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వెళ్లిపోయారు. సుమారు 260 గజాల స్థలంపై పలువురు కన్నేశారని, రెవెన్యూ శాఖ, గ్రేటర్‌ వరంగల్‌ అధికారులు స్పందించి స్థలాలకు హద్దులు ఖరారు చేసి, బోర్డు ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు