రైతు ఇంట.. చర్మ వ్యాధుల చింత
గతేడాది ఏకధాటిగా కురిసిన వర్షాలతో పత్తి దిగుబడి తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికందిన పంటనైనా అమ్ముకుందామంటే మార్కెట్‌లో ఆశించిన ధరలు లేక చాలామంది ఇళ్లలోనే నిల్వ చేసుకున్నారు.
ఇళ్లలో పత్తి నిల్వలతో ఇబ్బందులు
చర్మంపై వచ్చిన దద్దుర్లు
వెంకటాపూర్(ములుగు జిల్లా), న్యూస్‌టుడే: గతేడాది ఏకధాటిగా కురిసిన వర్షాలతో పత్తి దిగుబడి తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికందిన పంటనైనా అమ్ముకుందామంటే మార్కెట్‌లో ఆశించిన ధరలు లేక చాలామంది ఇళ్లలోనే నిల్వ చేసుకున్నారు. ఓ వైపు అప్పుల భారం వెంటాడుతుండగా మరోవైపు కొత్త సమస్య వచ్చి పడింది. ఎక్కువ కాలం ఇళ్లలో నిల్వ చేయడంతో పత్తిని పురుగులు ఆశిస్తున్నాయి. వాటితో రైతుల కుటుంబ సభ్యులకు చర్మవ్యాధులు సోతుకున్నాయి. చర్మమంతా ఎర్రటి దద్దుర్లు వచ్చి ఇబ్బంది పడుతున్నారు. పంటను అమ్ముకోలేక, ఇంటిలో నిల్వ ఉంచలేక సతమతమవుతున్నారు.
* మిర్చి సాగులో లాభాలు లేకపోవడం, ఊహించని స్థాయిలో పత్తికి ధర రావడంతో గతేడాది రైతులు పత్తి సాగుకు మొగ్గు చూపారు. ఈ క్రమంలో భారీ వర్షాలతో పంట దెబ్బతిని దిగుబడి తగ్గింది. పెట్టుబడి భారం పెరిగినా మద్దతు ధర లభిస్తుందన్న ఆశతో ముందుకు సాగారు. క్రమంగా ధరలు పతనం కావడంతో నిరాశకు గురైన రైతులు మళ్లీ ధరలు పెరుగుతాయని పంటను ఇళ్లలో నిల్వలు చేశారు. ప్రస్తుతం క్వింటాకు రూ.7 వేలు మాత్రమే ఉండడంతో పెట్టుబడులు రావని మనోవేదనకు గురవుతున్నారు. దళారులు, కొనుగోలుదారులు ధరలు పెరగకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని క్వింటాకు రూ.10 వేల ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
వెంకటాపూర్‌లోని ఓ ఇంట్లో నిల్వ చేసిన పత్తి
పెట్టుబడి వచ్చేలా లేదు: ఎ.మదుసూదన్, రైతు, వెంకటాపూర్
నాకున్న ఎకరం భూమిలో పత్తి సాగు చేశాను. మొదట్లో కురిసిన వర్షాలకు కలుపుమొక్కలు ఏపుగా పెరిగాయి. వర్షాలు తగ్గుముఖం పట్టగానే కూలీల సహాయంతో కలుపు తొలగించాం. పత్తి ఎదుగుదల కోసం అదనపు పెట్టుబడి పెట్టాను. చివరి క్షణంలో మళ్లీ వర్షాలు వచ్చి పూత, కాత రాలిపోయింది. అప్పటికే ఎకరానికి రూ.40 వేల పెట్టుబడి అయింది. సుమారు 6 క్వింటాళ్ల పత్తి మాత్రమే చేతికి వచ్చింది. ధరలు లేకపోవడంతో ఇళ్లలో నిల్వ చేశాం. దాంతో చర్మ వ్యాధుల సమస్య మొదలైంది.
ఇంట్లో అందరికీ సోకింది: బల్ల సరోజన, జంగాలపల్లి
ఐదెకరాల్లో పత్తి సాగు చేశాం. సుమారు 50 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ధరలు లేకపోవడంతో మొత్తం ఇంటి వద్దనే నిల్వ చేశాం. మొన్న కురిసిన వర్షంతో పత్తిలో ఉన్న పురుగులు బయటకు వచ్చాయి. చర్మంపై పాకడంతో దద్దుర్లు వస్తున్నాయి. పండగ సందర్భంగా ఇంటికి వచ్చిన బంధువులు కూడా ఇబ్బంది పడ్డారు. ఇంట్లో ఉన్న ముగ్గురం డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడుతున్నాం. ధరలు పెరిగేలా ప్రభుత్వం చొరవ చూపాలి.
ప్రమాదం ఏం లేదు: డాక్టర్ శ్రీకాంత్, వెంకటాపూర్ పీహెచ్‌సీ
చర్మంపై దద్దుర్లు వచ్చి దురద వస్తుందని వారం రోజుల నుంచి బాధితులు వస్తున్నారు. ఆరా తీస్తే ఇంట్లో పత్తి నిల్వలు ఉన్నట్లు చెప్పారు. అధిక పురుగు మందులు వాడకం, వాతావరణంలో మార్పుల వల్ల పత్తిలో ఉన్న పురుగులు బయటకు వచ్చి దురదకు దారి తీస్తున్నాయి. నివారణ కోసం నీళ్లలో డెటాల్ కలుపుకుని స్నానం చేయాలి. పెద్ద ప్రమాదం ఏమీ ఉండదు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
అవును.. నేను బైసెక్సువల్‌ను: అందాల భామ సంచలన ప్రకటన
-
Sports News
IPL 2023 : కోట్లు పెట్టి కొన్నా.. కొట్టింది కొందరే..
-
Crime News
Hyderabad: సోదరి నైటీలో వచ్చి చోరీ.. బెడిసి కొట్టిన సెక్యూరిటీ గార్డ్ ప్లాన్
-
General News
Top Ten News @ 5PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Kiran Kumar Reddy: నాకున్న అనుభవంతో భాజపా బలోపేతానికి కృషి చేస్తా: కిరణ్ కుమార్ రెడ్డి
-
Crime News
Prakasam: అప్పుడే పుట్టిన శిశువును సంచిలో కట్టి.. గిద్దలూరులో అమానుషం!