logo

మేడారం పూజారి హత్య కేసులో అనుమానితుడి గుర్తింపు

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఈ నెల 20న వనదేవతల పూజారి దబ్బకట్ల రవి హత్యకు గురైన విషయం తెలిసిందే.

Published : 27 Mar 2023 06:04 IST

పోలీసులు విడుదల చేసిన చిత్రం

తాడ్వాయి, న్యూస్‌టుడే: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఈ నెల 20న వనదేవతల పూజారి దబ్బకట్ల రవి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో నేరస్థుణ్ని పట్టుకునేందుకు తాడ్వాయి పోలీసులు శ్రమిస్తున్నారు. హత్య జరగడానికి ఒక రోజు ముందు నుంచి వడగళ్ల వర్షం కురవడంతో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. పంచాయతీ కార్యాలయం, ఆలయంలోని సీసీ కెమెరాలు మాత్రమే పనిచేశాయి. దీంతో నిందితుణ్ని గుర్తించడం పోలీసులకు ఇబ్బందిగా మారింది. ఎట్టకేలకు పంచాయతీ సీసీ కెమెరాల్లో ఓ అనుమానితుడి ఫుటేజీలు లభ్యమయ్యాయి. అతడి చిత్రాలను విడుదల చేశారు. అనుమానితుడి గురించి సమాచారం తెలిస్తే 8712670112, 8712670027, 8712670088 నెంబర్లకు ఫోన్‌ చేసి తెలియజేయాలని తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వర్‌రావు కోరారు.


హంతకులను కఠినంగా శిక్షించాలి

తాడ్వాయి: మేడారంలో పూజారి దబ్బకట్ల రవిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని భాజపా గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి చింత కృష్ణ డిమాండ్‌ చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆదివారం బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. నిత్యావసర సరకులు, నగదు సాయం అందించారు. రవి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇప్పించాలని కోరారు. మండల అధ్యక్షుడు మల్లెల రాంబాబు, నాయకులు కొండూరు నరేష్‌, తాళ్లపెల్లి లక్ష్మణ్‌, జంఘ హన్మంతరెడ్డి, మాదరి శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని