logo

బాలికల ఆత్మరక్షణకు కరాటే అవసరం

బాలికల ఆత్మరక్షణకు కరాటే ఎంతగానో అవసరమని ఏటూరునాగారం సీఐ ఎం.రాజు అన్నారు.

Published : 27 Mar 2023 06:04 IST

బెల్టులు పొందిన విద్యార్థినులతో సీఐ రాజు, పీవై లక్ష్మి, అబ్బు

ఏటూరునాగారం, న్యూస్‌టుడే: బాలికల ఆత్మరక్షణకు కరాటే ఎంతగానో అవసరమని ఏటూరునాగారం సీఐ ఎం.రాజు అన్నారు. ఆదివారం స్థానిక కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో కరాటే పోటీలు నిర్వహించారు. 29 మందికి పసుపు బెల్టు, 19 మందికి నారింజ బెల్టులు ప్రదానం చేశారు. క్రమశిక్షణ అలవర్చుకుని ఉన్నత చదువులు చదివి ఉత్తమ ఉద్యోగాలు సాధించాలన్నారు. ఏదైనా ఇబ్బంది ఎదురైతే 100 నెంబరుకు కాల్‌ చేసి పోలీసుల సాయం తీసుకోవాలని చెప్పారు. కరాటే మాస్టర్‌ అబ్బు, పాఠశాల ప్రత్యేకాధికారి పీవై.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని