‘సులక్ష్య’ సేవలు అభినందనీయం
సామాజిక సేవలో సులక్ష్య సేవా సమితి సేవలు అభినందనీయమని సీబీఐ మాజీ జేడీ వి.వి.లక్ష్మీనారాయణ అన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న లక్ష్మీనారాయణ
హనుమకొండ కలెక్టరేట్, న్యూస్‌టుడే: సామాజిక సేవలో సులక్ష్య సేవా సమితి సేవలు అభినందనీయమని సీబీఐ మాజీ జేడీ వి.వి.లక్ష్మీనారాయణ అన్నారు. సమితి పదో వార్షికోత్సవం వాగ్దేవి కళాశాల ఆడిటోరియంలో నిర్వహించారు. ముఖ్య అతిధిగా హాజరైన లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాజకీయ వ్యవస్థలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వాలతో సమానంగా పని చేసినప్పుడే ప్రజల అవసరాలు తీరుతాయన్నారు. సులక్ష్య లాంటి సంస్థలు ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తాయన్నారు. ఐఆర్‌ఎస్ అధికారి సందీప్ మాట్లాడుతూ ఎందరికో వెలుగులు నింపుతున్న సమితిని ఆయన ప్రశంసించారు. సమితి వ్యవస్థాపకుడు మండువ సంతోష్, సమాచార హక్కు ఉద్యమకర్త రాకేష్, కౌశిక్ భూపతి, శాంత, సాయికిరణ్, వినయ్, వంశీ, వికాస్ పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
అభివృద్ధిపై ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే ఆగ్రహం
-
Sports News
IPL Final: ‘బాగా బౌలింగ్ చేస్తున్న వాడిని ఎందుకు డిస్టర్బ్ చేశావు’.. హార్దిక్‌పై సెహ్వాగ్ ఫైర్
-
India News
Maharashtra: మరో జిల్లాకు పేరు మారుస్తూ శిందే సర్కార్ ప్రకటన
-
Movies News
Social Look: దెహ్రాదూన్‌లో అనన్య పాండే.. చీరలో అనసూయ హొయలు
-
Movies News
ఆనాడు దర్శకుడికి కోపం తెప్పించిన నయనతార.. ‘నువ్వు రావొద్దు’ అని చెప్పేసిన డైరెక్టర్
-
World News
అవును.. నేను బైసెక్సువల్‌ను: అందాల భామ సంచలన ప్రకటన