logo

‘రాహుల్‌గాంధీపై అనర్హత వేటు ఎత్తివేయాలి’

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీపై పార్లమెంటులో అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ ఆదివారం తాడ్వాయి మండలంలో ఆ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

Published : 27 Mar 2023 06:04 IST

రాస్తారోకో చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

తాడ్వాయి, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీపై పార్లమెంటులో అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ ఆదివారం తాడ్వాయి మండలంలో ఆ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామాల నుంచి మండలకేంద్రం వరకు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మండలకేంద్రంలోని జాతీయరహదారిపై రాస్తారోకో చేపట్టారు. ప్రధాని దిష్టిబొమ్మ దహనం చేశారు. ఏటూరునాగారం-హనుమకొండ మార్గంలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పోలీసులు వచ్చి ఆందోళనను విరమింపజేసి రాకపోకలను పునరుద్ధరించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ముద్రకోళ్ల తిరుపతి, నాయకులు బొల్లు దేవేందర్‌, అర్రెం లచ్చుపటేల్‌, సర్పంచులు ఇర్ప సునిల్‌దొర, రేగ కల్యాణి, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ పులి సంపత్‌, సాంబయ్య, మల్లయ్య, జగదీష్‌, సిద్దిరెడ్డి, సతీష్‌, రాంబాబు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని