logo

టీవీ రీఛార్జి చేయలేదని బాలుడి ఆత్మహత్య

టీవీ, చరవాణి రీఛార్జి చేయలేదనే మనస్తాపంతో ఓ బాలుడు (12) ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Updated : 30 Mar 2023 11:00 IST

కాటారం, న్యూస్‌టుడే: టీవీ, చరవాణి రీఛార్జి చేయలేదనే మనస్తాపంతో ఓ బాలుడు (12) ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని ఓ గ్రామానికి చెందిన కూలీ పనులు చేసుకునే మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త మూడేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆరో తరగతి చదువుతున్న పెద్ద కుమారుడు మధ్యాహ్నం పాఠశాల నుంచి ఇంటికి వచ్చి టీవీ, చరవాణి రీఛార్జి చేయించమని తల్లిని కోరారు. టీవీకి సంబంధించిన తీగలు ఎలుకలు కొరికాయని.. మరమ్మతు చేయించిన అనంతరం చరవాణితో పాటు   చేయిస్తానని చెప్పి ఎడ్లకు మేత పెట్టేందుకు తల్లి బయటకు వెళ్లిపోయారు. మనస్తాపానికి గురైన బాలుడు క్షణికావేశంతో రేకుల ఇంటి పైకప్పు ఇనుప పైపునకు చీరతో ఉరివేసుకున్నాడు. గమనించిన స్థానికులు తల్లికి సమాచారం అందించి అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని మహాదేవపూర్‌ సామాజిక ఆసుపత్రికి తరలించారు. పరీక్షించి వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు  తల్లి, కుటుంబసభ్యుల రోదనలు పలువురిని కలచివేశాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని