గ్రామాల ప్రగతితోనే దేశాభివృద్ధి సాధ్యం
గ్రామాల ప్రగతితోనే దేశాభివృద్ధి సాధ్యమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తొర్రూరు మండలంలోని సోమారం, చింతలపల్లి గ్రామాల్లో బుధవారం భారాస ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు.
మహిళలతో కలిసి నేలపై కూర్చొని భోజనం చేస్తున్న మంత్రి ఎర్రబెల్లి దంపతులు
తొర్రూరు, న్యూస్‌టుడే: గ్రామాల ప్రగతితోనే దేశాభివృద్ధి సాధ్యమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తొర్రూరు మండలంలోని సోమారం, చింతలపల్లి గ్రామాల్లో బుధవారం భారాస ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. మంత్రి ఎర్రబెల్లి, ఎర్రబెల్లి ఛారిటబుల్ ట్రస్టు ఛైర్‌పర్సన్ ఉషాదయాకర్‌రావు మహిళలతో కలిసి నేలపై కూర్చొని భోజనాలు చేశారు. మంత్రి మాట్లాడుతూ 3146 గూడేలు, తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. చింతలపల్లిలో దుర్గమ్మ ఆలయం, మహిళా భవనం నిర్మాణానికి నిధులు అందజేస్తామన్నారు. ఎంపీపీ చిన్నఅంజయ్య, జడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్, పీఏసీఎస్ ఛైర్మన్ హరిప్రసాదు, మున్సిపల్ ఛైర్మన్ రామచంద్రయ్య, వైస్ ఎంపీపీ శ్యామ్‌సుందర్‌రెడ్డి, రూరల్ డెవలప్‌మెంట్ కమిషన్ సభ్యుడు వెంకట్‌నారాయణగౌడ్, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఆలయాల పునరుద్ధరణకు నిధులు
తొర్రూరు: శిథిలావస్థకు చేరిన ఆలయాల పునరుద్ధరణకు కేసీఆర్ అధిక నిధులు కేటాయిస్తున్నారని మంత్రి తెలిపారు. తొర్రూరు మండలం మాటేడులో కాకతీయుల కాలంలో నిర్మించిన రామలింగేశ్వరస్వామి, సారంగేశ్వరస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బండ్లు తిరిగే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయాల అభివృద్ధికి రూ.50 లక్షలు మంజూరు చేస్తామన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Kevvu Karthik: కాబోయే సతీమణిని పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్
-
India News
Railway Board: గూడ్స్ రైలులో ఇనుప ఖనిజం.. ప్రమాద తీవ్రతకు అదీ ఓ కారణమే : రైల్వే బోర్డు
-
Politics News
Rahul Gandhi: తెలంగాణలోనూ భాజపాను తుడిచిపెట్టేస్తాం: రాహుల్ గాంధీ
-
Politics News
Nellore: తెదేపా నేత ఆనం వెంకటరమణారెడ్డిపై దాడికి యత్నం
-
Politics News
Kodandaram: అవసరమైతే మా పార్టీ విలీనం: కోదండరామ్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
India News
Odisha Train Accident: 382 మందికి కొనసాగుతోన్న చికిత్స.. చెన్నై చేరుకున్న ప్రత్యేక రైలు!