logo

మూగజీవాల అక్రమ రవాణాపై ఎస్పీకి ట్వీట్

ములుగు జిల్లా మీదుగా మూగ జీవాల అక్రమ రవాణా గత కొంతకాలంగా కొనసాగుతూనే ఉంది. ఛత్తీస్‌గఢ్‌, భద్రాద్రి కొత్తగూడెం తదితర ప్రాంతాల నుంచి వాహనాల ద్వారా ములుగు మీదుగా హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.

Published : 30 Mar 2023 04:39 IST

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి: ములుగు జిల్లా మీదుగా మూగ జీవాల అక్రమ రవాణా గత కొంతకాలంగా కొనసాగుతూనే ఉంది. ఛత్తీస్‌గఢ్‌, భద్రాద్రి కొత్తగూడెం తదితర ప్రాంతాల నుంచి వాహనాల ద్వారా ములుగు మీదుగా హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. పలుసార్లు పట్టుబడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈనెల 27వ తేదీన రాత్రి జిల్లా కేంద్రంలో కొందరు స్థానికులు, భాజపా నాయకులు మూగజీవాలను తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడికి చేరుకున్నారు. రవాణాదారులపై చర్యలు తీసుకోవాలని భాజపా నాయకులు పోలీసులను కోరారు. కాగా ఫొటోలు తీసుకుని ఎస్సై వాహనాన్ని వదిలేశారని, చర్యలు తీసుకోలేదని స్థానికులు ములుగు ఎస్పీకి ట్వీట్ చేశారు. యథేచ్ఛగా పశువుల అక్రమ రవాణా జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ వాహనం ఫొటోలు పోస్ట్‌ చేశారు. ఈ విషయంపై ‘ఈనాడు’ జిల్లా ఎస్పీ గాష్‌ ఆలంను చరవాణిలో సంప్రదించగా.. పూర్తి వివరాలు తెలుసుకుంటామని చెప్పారు. ములుగు ఎస్సై పవన్‌ను వివరణ కోరగా.. ఆ రోజు తాను అక్కడికి వెళ్లి పరిశీలన చేశానని తెలిపారు. వాహనంలో ఆవులు లేవని నిర్ధారించుకున్నామన్నారు. పంచాయతీ నుంచి ఇచ్చిన అనుమతి పత్రం చూపడంతో వాహన యజమాని, డ్రైవర్‌ వివరాలు తీసుకుని పంపించినట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని