logo

ప్రతి మండలంలో పెట్రోలు బంకు ఏర్పాటుకు చర్యలు

గిరిజన సహకార సంస్థ ద్వారా ప్రతి మండలంలో ఒక పెట్రోల్‌ బంకు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు జీసీసీ ఏటూరునాగారం డివిజనల్‌ మేనేజర్‌ ప్రతాప్‌రెడ్డి అన్నారు.

Published : 30 Mar 2023 04:39 IST

సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న జీసీసీ డీఎం ప్రతాప్‌రెడ్డి

ములుగు, న్యూస్‌టుడే: గిరిజన సహకార సంస్థ ద్వారా ప్రతి మండలంలో ఒక పెట్రోల్‌ బంకు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు జీసీసీ ఏటూరునాగారం డివిజనల్‌ మేనేజర్‌ ప్రతాప్‌రెడ్డి అన్నారు. బుధవారం ములుగు మండలం ఇంచెర్ల శివారులోని జీసీసీ పెట్రోల్‌ బంక్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన ములుగు గిరిజన ప్రాథమిక సహకారం సంఘం సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తహసీల్దార్ల సహకారంతో రామాంజపూర్‌, వెంకటాపూర్‌ మండలాల్లో బంకుల ఏర్పాటుకు స్థల సేకరణ చేయాలని సూచించారు. జాకారంలో ఏప్రిల్‌ చివరి వారంలోగా బంక్‌ ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అడవిలో విప్పపువ్వు, విప్ప గింజల సేకరణ అధికంగా జరిపి గిరిజనులకు ఆదాయం కల్పించాలని ఆదేశించారు. విప్ప గింజలు అధికంగా సేకరించినట్లయితే ఐటీడీఏ ద్వారా విప్ప నూనె కర్మాగారం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ములుగు బ్రాంచి మేనేజర్‌ శ్రీనివాస్‌, డైరెక్టర్లు దనసరి సమ్మక్క, వంక కాంతమ్మ, చింత వెంకన్న, పోరిక వెంకట్రాం, బానోతు మంగ్య, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు