logo

తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు

వేసవిలో తాగునీటికి ఇబ్బంది రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ సెగ్గం వెంకటరాణి తెలిపారు.

Published : 30 Mar 2023 04:39 IST

సమావేశంలో మాట్లాడుతున్న మున్సిపాలిటీ ఛైర్‌ పర్సన్‌ సెగ్గం వెంకటరాణి, కమిషనర్‌ అవినాష్‌

భూపాలపల్లి, న్యూస్‌టుడే: వేసవిలో తాగునీటికి ఇబ్బంది రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ సెగ్గం వెంకటరాణి తెలిపారు. బుధవారం మున్సిపాలిటీ సమావేశ మందిరంలో పురపాలక సంఘం సాధారణ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఛైర్‌పర్సన్‌ మాట్లాడుతూ.. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆదేశాల మేరకు పలు ప్రాంతాల్లో ఇప్పటికే తాగునీటి బోర్లు వేశామన్నారు. మూలకుపడ్డ బోర్లకు మరమ్మతులు చేయించాలన్నారు. నీటి సమస్య ఎక్కువగా ఉన్న వీధుల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని పేర్కొన్నారు. పట్టణంలో మిషన్‌ భగీరథ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భూపాలపల్లి పట్టణంలో ప్రత్యేకంగా ఆటోనగర్‌ ఏర్పాటు కోసం అనుకూలమైన స్థలాన్ని పరిశీలిస్తున్నామన్నారు. కార్మికులు ఎక్కువగా ఉండే రాంనగర్‌కాలనీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని, రెండు పడక గదుల ఇళ్లను పారదర్శకంగా పంపిణీ చేయాలని 16వ వార్డు కౌన్సిలర్‌ దాట్ల శ్రీనివాస్‌ కోరారు. రెండు ఏళ్లుగా ఇళ్లు నిరుపయోగంగా ఉంటున్నాయని, సత్వరంగా వాటిని పేద కుటుంబాలకు పంపిణీ చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో వైస్‌ ఛైర్మన్‌ కొత్త హరిబాబు, కమిషనర్‌ అవినాష్‌, ఏఈ రోజారాణి, మేనేజర్‌ స్వామి, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ప్రశాంతి, నవీన్‌, ఆర్‌ఐ భాస్కర్‌, సుభాష్‌, విష్ణువర్థన్‌ వివిధ శాఖల అధికారులు, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని