logo

మెలకువలు పాటిస్తే పాల ఉత్పత్తి పెంపు

పాడి రైతులు పాల ఉత్పత్తి, నాణ్యతను పెంచేందుకు మెలకువలు పాటించాలని తెలంగాణ రాష్ట్ర పాల నాణ్యత నియంత్రణ అధికారి రమేశ్‌ అన్నారు.

Published : 30 Mar 2023 04:39 IST

ప్రసంగిస్తున్న పాల నాణ్యత నియంత్రణ  అధికారి రమేశ్‌

జనగామ రూరల్‌, న్యూస్‌టుడే: పాడి రైతులు పాల ఉత్పత్తి, నాణ్యతను పెంచేందుకు మెలకువలు పాటించాలని తెలంగాణ రాష్ట్ర పాల నాణ్యత నియంత్రణ అధికారి రమేశ్‌ అన్నారు. జనగామలోని పాల శీతలీకరణ కేంద్రంలో పాల ఉత్పత్తి, నాణ్యతను పెంపొందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పాడి రైతులకు బుధవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్‌ ధనరాజ్‌ అధ్యక్షత వహించగా.. రమేశ్‌ మాట్లాడారు. పశువులకు ప్రొటీన్‌  కలిగిన గడ్డిని మేతగా వాడాలని, ప్రతి రోజు శుభ్రమైన నీరందించాలని, మినరల్‌ మిక్షర్‌, కాల్షియం అందించాలని, నాలుగు నెలలకోసారి నట్టల మందులు వేయించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా మేనేజర్‌ హరికృష్ణ, స్టేషన్‌ఘన్‌పూర్‌, సింగరాజుపల్లి మేనేజర్లు లింగాలరెడ్డి, లక్ష్మి, క్షేత్ర అధికారులు, సూపర్‌ వైజర్లు, సొసైటీల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని