logo

రామచంద్రగూడెంలో న్యాయమూర్తి ప్రీతి సందడి

న్యాయమూర్తిగా ఎంపికై అమ్మమ్మ గ్రామమైన రఘునాథపల్లి మండలం రామచంద్రగూడెంలో మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణానికి చెందిన దామెర్ల సిద్ధయ్య రమ దంపతుల కుమార్తె ప్రీతి బుధవారం సందడి చేశారు.

Published : 30 Mar 2023 04:39 IST

ప్రీతిని సత్కరిస్తున్న ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు

రఘునాథపల్లి, న్యూస్‌టుడే: న్యాయమూర్తిగా ఎంపికై అమ్మమ్మ గ్రామమైన రఘునాథపల్లి మండలం రామచంద్రగూడెంలో మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణానికి చెందిన దామెర్ల సిద్ధయ్య రమ దంపతుల కుమార్తె ప్రీతి బుధవారం సందడి చేశారు. తాత యామంటి మల్లయ్య మరణానంతరం అమ్మమ్మ యోగక్షేమాలను తెలుసుకునేందుకు తల్లి రమతో కలిసి గ్రామానికి చేరుకోవడంతో ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు స్వాగతం పలికారు. ఊరంతా తిరిగి గ్రామస్థులతో ముచ్చటించారు. హైదరాబాద్‌ కేశవ్‌ మెమోరియల్‌ కళాశాలలో ఎల్‌ఎల్‌బి చదువుకున్న ప్రీతి నల్సార్‌ విశ్వవిద్యాలయంలో మాస్టర్‌ ఆఫ్‌ లా పూర్తి చేసి గతేడాదీ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సివిల్‌ జడ్జి పరీక్షలో 25 ఏళ్ల వయసులో మొదటి ప్రయత్నంలోనే న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. జడ్జిగా ఎంపికై ఆమె మొదటిసారిగా అమ్మమ్మ ఇంటికి రావడంతో సర్పంచి పయ్యావుల లావణ్య, పంచాయతీ పాలకవర్గ సభ్యులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈసందర్భంగా ప్రీతి మాట్లాడుతూ సమాజసేవలో భాగంగా బాధితులకు న్యాయం అందించాలని, తలితండ్రుల ఆశలు నెరవేర్చాలనే దృఢ సంకల్పతో జడ్జి పదవిపొందానన్నారు. కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గ సభ్యులు ఉప్పమ్మ, ఎలేందర్‌, కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని