logo

రాహుల్‌జీ మా ఇంటికి రండి..

‘రాహుల్‌ జీ.. మా ఇంటికి రండి’ అంటూ ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీని హనుమకొండ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు నాయిని రాజేంద్‌రెడ్డి  సాదరంగా ఆహ్వానించారు.

Published : 30 Mar 2023 04:39 IST

రంగంపేట, న్యూస్‌టుడే: ‘రాహుల్‌ జీ.. మా ఇంటికి రండి’ అంటూ ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీని హనుమకొండ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు నాయిని రాజేంద్‌రెడ్డి  సాదరంగా ఆహ్వానించారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం రాహుల్‌గాంధీ లోకసభ సభ్యత్వం రద్దు చేసిందని, ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో హనుమకొండ నయీంనగర్‌ జాగృతి కాలనీలో బుధవారం తన ఇంటి గోడపై రాహుల్‌ గాంధీ నివాసం అంటూ చిత్రపటం ఏర్పాటుచేసి ఆహ్వానించారు.  రాహుల్‌ గాంధీ మా గుండెల్లో ఉన్నారని, 130 కోట్ల ప్రజానీకం తలుపులు తెరిచి ఆహ్వానిస్తున్నారని రాజేందర్‌రెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని