శివారు.. వెంచర్ల జోరు!
జిల్లా కేంద్రం రోజురోజుకు విస్తరిస్తోంది.. జాతీయ రహదారి జిల్లా మీదుగా వెళ్లడం.. ఇదివరకే పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఈ ప్రాంతంలో భూములకు డిమాండ్ పెరిగింది.
అనుమతులు లేకుండానే ఏర్పాటు
ఈనాడు డిజిటల్, జయశంకర్ భూపాలపల్లి
జిల్లా కేంద్రం రోజురోజుకు విస్తరిస్తోంది.. జాతీయ రహదారి జిల్లా మీదుగా వెళ్లడం.. ఇదివరకే పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఈ ప్రాంతంలో భూములకు డిమాండ్ పెరిగింది. దీన్ని సొమ్ము చేసుకోవడానికి కొందరు అక్రమంగా వెంచర్లను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా కేంద్రం శివారు ప్రాంతాల్లో వెంచర్లు కుప్పలు తెప్పలుగా వెలుస్తున్నాయి. అనుమతి లేనివి పదుల సంఖ్యలో ఉంటున్నాయి. లే అవుట్ అనుమతి లేకుండానే ప్లాట్లుగా చేసి అమ్మకాలు జోరుగా సాగిస్తున్నారు. ఇది తెలియక కొనుగోలు చేసిన వారు మోసపోతున్నారు.
జిల్లా కేంద్రంలో 20కి పైగా..
జిల్లాలో సింగరేణి, జెన్కో విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలతో పారిశ్రామికంగా పేరొందింది. దీంతో పాటు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాల నూతన భవన నిర్మాణాలు, అపార్టుమెంట్లు వెలుస్తున్నాయి. దీంతో భూములకు డిమాండ్ వస్తోంది. కొందరు శివారు ప్రాంతాల్లోని వ్యవసాయ భూములను తక్కువ ధరలకు కొనుగోలు చేసి ప్లాట్లుగా ఏర్పాటు చేస్తున్నారు. వాటికి ఎలాంటి అనుమతులు తీసుకోవడం లేదు. జిల్లా కేంద్రంలో 20కి పైగా వెంచర్లు వెలిశాయి. అందులో 7 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 13 లే అవుట్లకు అనుమతులు లేవని అధికారులు తేల్చారు. అంటే ఏ స్థాయిలో అక్రమ వెంచర్లు వెలుస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.
తెలియక కొనుగోలు చేస్తే ఇక్కట్లే..
అనుమతులు లేని ప్లాట్లను కొనుగోలు చేస్తే భవిష్యత్తులో ఇక్కట్లు తప్పవు.. ఇల్లు నిర్మించుకోవాలనుకుంటే నిర్మాణ అనుమతులు రావు.. ఎల్‌ఆర్‌ఎస్ లాంటి పథకాల్లో తిరిగి ప్రభుత్వానికి అదనంగా చెల్లించి క్రమబద్ధీకరించుకోవాల్సి ఉంటుంది. అలా అదనపు భారం పడుతుంది. భవిష్యత్తులో పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసమని సామాన్యులు పైసాపైసా కూడబెట్టుకొని ప్లాట్లను కొనుగోలు చేసుకుంటే అనుమతులు లేని వాటిని అంటగట్టి మోసం చేస్తున్నారు. అనుమతి లేని ప్లాట్లు కొనుగోలు చేస్తే చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. అనుమతులు ఉన్నాయా..? డీటీసీపీ పరిధిలో ఉందా..? లేదా..? తదితర ధ్రువపత్రాలను సరిచూసుకొని కొనుగోలు చేసుకోవాలి. అధికారులు అక్రమ వెంచర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి.
బోర్డులు ఏర్పాటు చేయిస్తున్నాం..
-అవినాశ్, ఇంఛార్జి మున్సిపల్ కమిషనర్, భూపాలపల్లి
అనుమతులు లేని వెంచర్లను గుర్తిస్తున్నాం. వాటిని కొనుగోలు చేయరాదని బోర్డులు పెట్టాం.. నాలా అనుమతి లేని ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేయకూడదని ములుగు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చెప్పాం. అక్రమ వెంచర్ల జాబితా, సర్వే నంబర్ల నివేదిక పంపించాం. అక్రమ వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారని సమాచారం అందితే అడ్డుకుంటున్నాం. ప్లాట్లు కొనుగోలు చేసేటప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి.
తొలగిస్తున్నా.. మారని తీరు..
మున్సిపల్ అధికారులు లే అవుట్ అనుమతి లేని ప్లాట్ల హద్దురాళ్లను తొలగిస్తూ.. అనుమతులు లేని వెంచర్లని బోర్డులు ఏర్పాటు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. అధికారులు అలా వెళ్లాక మళ్లీ అదే తీరు.. బోర్డులు తీసేయడం యథాతథంగా వ్యాపారం నిర్వహించడం పరిపాటిగా మారింది. నిబంధనల ప్రకారం వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాలి. ఏర్పాటు చేసే స్థలంలో పది శాతం పార్కులకు ఇతరత్రా అవసరాలకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, అలాంటి నిబంధనలను పాటించకుండా ఏర్పాటు చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Kishan Reddy: తెలంగాణ తెచ్చుకున్నది అప్పుల కోసమా?: కిషన్‌రెడ్డి
-
Movies News
Spider Man: ‘స్పైడర్ మ్యాన్’ అభిమానులకు తీపి కబురు
-
Sports News
MS Dhoni: విజయవంతంగా ధోని మోకాలికి శస్త్రచికిత్స
-
Crime News
Kurnool: జగన్ ప్రసంగిస్తుండగా యువకుడిపై పోలీసుల దాడి
-
Sports News
IND vs PAK: కుర్రాళ్లు కేక.. ఫైనల్లో పాకిస్థాన్‌పై విజయం
-
Ap-top-news News
Amaravati: పనులే పూర్తి కాలేదు.. గృహ ప్రవేశాలు చేయమంటే ఎలా?