logo

నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

వరంగల్ ఏనుమాముల మార్కెట్‌ సమీపంలోని ముసలమ్మకుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.

Published : 31 Mar 2023 15:49 IST

ఎంజీఎం ఆసుపత్రి: వరంగల్ ఏనుమాముల మార్కెట్‌ సమీపంలోని ముసలమ్మకుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం ముసలమ్మ కుంట శివారులోని చాకలి ఐలమ్మ నగర్‌కు చెందిన తూదాని లకన్‌ సింగ్‌, లక్ష్మి దంపతుల కుమారులు కిరణ్‌ సింగ్‌(12), దీపక్‌ సింగ్‌(7) ఉదయం బహిర్భూమి కోసం చెరువులోకి వెళ్లారు. మిషన్‌ కాకతీయ పనుల కోసం తీసిన నీటి కుంటలో పడి వారు అపస్మారక స్థితికి చేరుకున్నారు. స్థానికులు గమనించి వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఘటనపై ఏనుమాముల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు