logo

సీపీఆర్‌పై అవగాహన తప్పనిసరి

ప్రతి ఒక్కరూ సీపీఆర్‌పై అవగాహన పెంచుకుంటే గుండెపోటు వచ్చిన వారి ప్రాణాలు కాపాడుకోవచ్చని జిల్లా కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్లబ్‌ హౌస్‌లో శుక్రవారం కలెక్టర్‌ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.

Updated : 01 Apr 2023 06:39 IST

ప్రసంగిస్తున్న జిల్లా కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా

భూపాలపల్లి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరూ సీపీఆర్‌పై అవగాహన పెంచుకుంటే గుండెపోటు వచ్చిన వారి ప్రాణాలు కాపాడుకోవచ్చని జిల్లా కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్లబ్‌ హౌస్‌లో శుక్రవారం కలెక్టర్‌ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. గుండె పోటుకు గురైన వ్యక్తుల ప్రాణాలను కాపాడేందుకు సీపీఆర్‌పై ప్రత్యేక శిక్షణ పొందిన ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ అన్వేషిణి, ప్రమోద్‌లతో జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్య సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. కోవిడ్‌ అనంతరం చాలా మంది గుండె నొప్పితో మృతి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం సీపీఆర్‌ ప్రక్రియపై వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఒక వ్యక్తి అకస్మాత్తుగా ‘కార్డియాక్‌ అరెస్టు’కు గురైతే సీపీఆర్‌, ఏఈడీ చేసినట్లయితే ప్రమాదం నుంచి కాపాడగల్గుతామని చెప్పారు. ఇలా చేయకపోవడంతో మరణాలు సంభవిస్తున్నాయని అన్నారు. ప్రస్తుత సమయంలో ప్రతి ఉద్యోగికి ఈ శిక్షణ అవసరం ఉందని తెలిపారు. ప్రాణానికి మించింది ఏదీ లేదని, మన చుట్టుపక్కల వారు ఆకస్మికంగా గుండెపోటుతో కుప్పకూలితే వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం ఇస్తూ వాహనం వచ్చే వరకు సీపీఆర్‌ చేస్తూ.. ఊపిరి అందిస్తే ఒక నిండు ప్రాణాన్ని కాపాడవచ్చని చెప్పారు. ప్రతి మండల కేంద్రాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులకు శిక్షణ పొందిన వారితో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో శ్రీరాం, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ సెగ్గం వెంకటరాణి, పలు మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని