logo

‘రాహుల్‌పై భాజపా కక్ష సాధింపు’

భాజపా ప్రభుత్వం భారత దేశ సంపదను అదానీ సంస్థలకు దోచి పెడుతున్నదని, ఇదే విషయాన్ని పార్లమెంటులో ప్రస్తావించినందుకే ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీపై రాజకీయంగా కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని మాజీ ఎంపీ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు.

Published : 01 Apr 2023 04:11 IST

హనుమకొండ డీసీసీ భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న టీపీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌

రంగంపేట, న్యూస్‌టుడే: భాజపా ప్రభుత్వం భారత దేశ సంపదను అదానీ సంస్థలకు దోచి పెడుతున్నదని, ఇదే విషయాన్ని పార్లమెంటులో ప్రస్తావించినందుకే ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీపై రాజకీయంగా కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని మాజీ ఎంపీ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. హనుమకొండ డీసీసీ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ దేశం కోసం బలిదానాలు చేసిన గాంధీ కుటుంబంపై భాజపా ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతున్నారని, ఈడీ విచారణలు చేస్తున్నారని విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్‌గాంధీ భారత్‌ జోడోయాత్ర నిర్వహించారన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాలు కార్పొరేటు సంస్థలకు కొమ్ము కాస్తున్నారని ధ్వజమెత్తారు. అదానీ డొల్ల కంపెనీల్లో పెట్టుబడులపై ఈడీ విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. పార్లమెంటులో ప్రధాని మోదీని నిలదీసిన తొమ్మిది రోజులకే రాహుల్‌గాంధీపై 2019లో వచ్చిన ఫిర్యాదును తెరమీదకు తీసుకువచ్చానరని మండిపడ్డారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో భాజపాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలపై అనేక కేసులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నాయని వీరిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రభాకర్‌ నిలదీశారు. రాహుల్‌గాంధీ అంటే భాజపాకు భయం పట్టుకుందని అందుకే లోకసభ సభ్యత్వాన్ని కుట్ర పూరితంగా రద్దు చేశారని ఆరోపించారు. సమావేశంలో హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, మాజీ మేయర్‌ ఎర్రబెల్లి స్వర్ణ, వర్ధన్నపేట సమన్వయకర్త నమిండ్ల శ్రీనివాస్‌, కార్పొరేటర్లు వెంకన్న, శ్రీమాన్‌ తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని