పల్లెకు పట్టాభిషేకం
రాష్ట్ర ప్రభుత్వం 2021-22 సంవత్సరానికి రాష్ట్రస్థాయిలో ఎంపిక చేసిన ఉత్తమ పంచాయతీల్లో ఉమ్మడి వరంగల్ నుంచి 8 గ్రామాలు చోటు సంపాదించుకున్నాయి.. కేంద్రం నిర్దేశించిన 9 అంశాల్లో ప్రమాణాల ప్రాతిపదికన వీటికి పురస్కారాలిచ్చారు.
మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు చేతుల మీదుగా పురస్కారం అందుకుంటున్న వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మరియాపురం సర్పంచి అల్లం బాలిరెడ్డి చిత్రంలో మంత్రి మల్లారెడ్డి, ఇతర అధికారులు
రాష్ట్ర ప్రభుత్వం 2021-22 సంవత్సరానికి రాష్ట్రస్థాయిలో ఎంపిక చేసిన ఉత్తమ పంచాయతీల్లో ఉమ్మడి వరంగల్ నుంచి 8 గ్రామాలు చోటు సంపాదించుకున్నాయి.. కేంద్రం నిర్దేశించిన 9 అంశాల్లో ప్రమాణాల ప్రాతిపదికన వీటికి పురస్కారాలిచ్చారు. ఇవి జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీ విభాగం కింద పోటీ పడడానికి అర్హత సాధించాయి. ఆయా పంచాయతీల సర్పంచులు శుక్రవారం హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మల్లారెడ్డి చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్నారు.
కాలుష్య నివారణకు కృషి..
* నవాబుపేట, చిట్యాల మండలం, జయశంకర్ భూపాలపల్లి నీ 2300 పర్యావరణ, ప్రకృతి - పచ్చదనం పరిశుభ్రతే లక్ష్యంగా ప్రభుత్వం వివిధ దశల్లో చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామ రూపురేఖలు మారిపోయాయి. ప్రభుత్వం, జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ గుర్తించి నిధులు మంజూరు చేశాయి. జిల్లాకు ఆదర్శంగా పల్లె ప్రకృతి వనం, సెగ్రిగేషన్ షెడ్ నిర్మించారు. సోలార్ వీధి దీపాలను ఏర్పాటు చేశారు.
* గ్రామభివృద్థికి సర్పంచి కసిరెడ్డి సాయిసుధ, పంచాయతీ కార్యదర్శి సుచరిత ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రోత్సహిస్తూ నిధులు మంజూరు చేయించారు. సర్పంచిగా కసిరెడ్డి సాయిసుధ ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత క్రమంగా పరిస్థితుల్లో మార్పు వచ్చింది. భర్త రత్నాకర్‌రెడ్డి సహకారం తీసుకుంటూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నారు.
చిట్యాల, న్యూస్‌టుడే
చిన్న గ్రామం.. ఆదర్శం
* ముకునూర్, పలిమెల మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా నీ 640 ్ర సామాజిక భద్రత - పలిమెల మండలంలోని ముకునూర్ 135 కుటుంబాలు నివసించే చిన్న గ్రామం. గ్రామంలో ఇప్పటికే పది కుటుంబాలకు దళితబంధు పథకం లబ్ధి చేకూరింది. పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్డు నిర్మించారు. గ్రామంలో అన్ని అంతర్గత రహదారులను సీసీ రోడ్లుగా మార్చారు. ఇంటింటికీ మిషన్ భగీరథ నీరును అందిస్తున్నారు. ్య సర్పంచి అలం సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి గ్రామ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. అభివృద్ధికి కట్టుబడి పనిచేశారు. ఇంటింటికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను చేరవేసేలా చర్యలు తీసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
పలిమెల
మౌలిక వసతుల కల్పన
* మల్లంపల్లి, ములుగు మండలం, ములుగు జిల్లా నీ 4670 ్ర స్వయం మౌలిక వసతుల కల్పన - శాశ్వత పంచాయతీ కార్యాలయ భవనం, ప్రత్యేక సమావేశ గది, ఆరోగ్య ఉప కేంద్రం, అన్ని గృహాలకు విద్యుత్తు సౌకర్యం, వీధి దీపాల నిర్వహణ, రవాణా సౌకర్యం, అంతర్గత సిమెంటు రోడ్లు, మురుగు కాల్వల వ్యవస్థ, అంగన్‌వాడీ కేంద్రం, పాఠశాలలో వసతులు, సాధారణ సేవా కేంద్రం(కామన్ సర్వీసు సెంటర్), మార్కెట్ సౌకర్యం, ప్రాథమిక సహకార సంఘం నూతన భవనం, శ్మశానవాటిక, సెగ్రిగేషన్ షెడ్డు, నర్సరీ, క్రీడా ప్రాంగణం, మురుగు కాల్వల నిర్మాణం, నిర్వహణ మొదలగు అంశాలు మల్లంపల్లి ఉత్తమ పంచాయతీగా ఎంపిక కావడానికి దోహదపడ్డాయి. ్య ప్రభుత్వం నుంచి సకాలంలో నిధుల విడుదల కాకపోయినా సర్పంచి చందా కుమారస్వామి స్వయంగా నిధులు సమకూర్చుకున్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి చేశారు. ప్రజా ప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యం కూడా తోడైంది.
ములుగు, న్యూస్‌టుడే
మౌలిక వసతుల కల్పన
* కామారెడ్డిగూడెం, దేవరుప్పుల మండలం, జనగామ జిల్లా నీ 3150 నీటి సమృద్ధి - పల్లెప్రగతి కార్యక్రమాలతో గ్రామంలో పేరుకుపోయిన సమస్యలు పరిష్కారమయ్యాయి. గ్రామంలోని అంతర్గత రహదారులను సీసీ రోడ్లుగా మార్చారు. సర్పంచి బిళ్ల అంజమ్మ పారిశుద్ధ్యం లోపించకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నారు. మిషన్ భగిరథ నీటితో పాటు బోరు బావుల ద్వారా గ్రామస్థులకు సరిపడా నీటిని సరఫరా చేస్తున్నారు. ్య ప్రతి నెలా సమావేశాలు నిర్వహిస్తూ సమస్యలను పరిష్కరించడంలో సర్పంచితో పాటు ఎంపీటీసీ సభ్యుడు జాకీర్ చొరవ తీసుకుంటున్నారు. వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయడం వల్లే ఉత్తమ పంచాయతీగా పురస్కారం దక్కిందని సర్పంచి తెలిపారు.
నీటి సరఫరాలో భేష్
దేవరుప్పుల రూరల్, న్యూస్‌టుడే : నెల్లుట్ల, లింగాలఘనపురం మండలం, జనగామ జిల్లా నీ 5645 నీటి సమృద్ధి - సంపూర్ణంగా నీటి సమృద్ధి గ్రామ పంచాయతీ ప్రణాళికలో భాగంగా నీటి సరఫరా నిర్వహణ ప్రణాళిక, చెరువు నీటి నిల్వలు, వాగు నీటి సంరక్షణ, ఇంటింటా భగీరథ నల్లా, నూరు శాతం వ్యక్తిగత ఇంకుడుగుంతలు, నీటి సంరక్షణలో పంచాయతీ, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలలో ప్రగతి సాధించి రాష్ట్ర స్థాయిలో ఎంపికైనట్లు అధికారులు వివరించారు. ్య జిల్లా అధికారులు, చిట్ల భూపాల్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి రొండ్ల శ్రీనివాస్‌రెడ్డి, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, గ్రామస్థుల సంపూర్ణ సహకారంతో పురస్కారం సాధించగలిగామని సర్పంచి స్వరూపారాణి చెప్పారు. ప్రజోపయోగ పనులను ప్రాధాన్య క్రమంలో పూర్తి చేయిస్తున్నామని అన్నారు. గ్రామ ప్రజలు సహకరించడంతోనే ఈ స్థాయికి వచ్చామని తెలిపారు.
న్యూస్‌టుడే, లింగాలఘనపురం
మహిళా సమస్యల పరిష్కారంలో ముందంజ
ఆత్మకూరు, హనుమకొండ జిల్లా నీ 2579 ్ర మహిళా స్నేహపూర్వక పంచాయతీ గ్రామంలోని మహిళా సమస్యలను గ్రామ సభల ద్వారా పరిష్కరించుకున్నారు. కిషోర బాలికల్లో రక్తహీనత లేకుండా పౌష్టికాహారం అందిస్తున్నారు. గ్రామంలో 6-10 సంవత్సరాల బాలికలు 293 మంది ఉండగా అందులో అందరూ పాఠశాలలకు వెళ్లి చదువుకుంటున్నారు. మహిళలంతా స్వయం సహాయక సంఘాల్లో సభ్యులై ఉన్నారు. బాల్య వివాహాల వల్ల అనర్థాలు, మహిళల భద్రత, హక్కులపై గ్రామంలో సదస్సులు నిర్వహించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
* ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, జిల్లా, మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శి పోలీస్ మోహన్‌రావు, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, మహిళల సంపూర్ణ సహకారంతో పురస్కారం సాధించగలిగామని సర్పంచి కోరే లలిత తెలిపారు. వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకుంటామన్నారు.-న్యూస్‌టుడే, హనుమకొండ కలెక్టరేట్, ఆత్మకూరు
ఆదర్శం మరియపురం
వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మరియపురం 2 విభాగాల్లో పురస్కారాలను అందుకుని ఆదర్శంగా నిలిచింది. ఆరోగ్య పంచాయతీ విభాగంలో మొదటి స్థానంలో నిలిచింది. పర్యావరణ, ప్రకృతి విభాగంలోనూ రాష్ట్ర స్థాయి పురస్కారం అందుకుంది. సర్పంచిఅల్లం బాలిరెడ్డి కృషి వల్ల ఇది సాధ్యమైంది.
ఇంటింటికీ మిషన్ భగీరథ
* చాప్లాతండా(డోర్నకల్ మండలం, మహబూబాబాద్ జిల్లా) నీ 1532 ్ర నీటి సమృద్ధి - తండాలోని 270 ఇళ్లకు మిషన్ భగీరథ నీరు అందుతోంది. రూ.39 లక్షల వ్యయంతో నీటి అవసరాలు తీర్చడానికి 40 వేలు, 20 వేలు, 10 వేలు లీటర్ల సామర్ధ్యం కలిగిన మూడు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు నిర్మించారు. బాల వికాస్ ఆధ్వర్యంలో రూ.5 లక్షల వ్యయంతో వాటర్ ప్లాంట్ నెలకొల్పి సోలార్ ఏర్పాటు చేశారు. రూ.12,53,880 వ్యయంతో ఇంటింటా ఇంకుడు గుంతలు, రూ.12,75,000 వ్యయంతో 75 రూఫ్ టాప్ రేయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లు, రూ.11,03,942 వ్యయంతో రెండు నీటి నిల్వ కందకాలు, రూ.97,300 వ్యయంతో రెండు పశువుల నీటి తొట్టెలు నిర్మించారు. ్య సర్పంచి పాండూనాయక్, పంచాయతీ కార్యదర్శి సంపత్ తండాలో నీటి సంరక్షణ చర్యలు పకడ్బందీగా అమలు పరిచారు. ఎంపీడీవో అపర్ణ, ఎంపీవో మున్వర్‌బేగ్, పంచాయతీ పాలకవర్గం, తండావాసుల సహకారంతో చేపట్టిన నీటి సమృద్ధి కార్యాచరణ సత్ఫలితమిచ్చింది. తండాలో శానిటేషన్ డ్రింకింగ్ వాటర్ కమిటీ ఏర్పాటు చేశారు. లీకేజీలు లేకుండా జాగ్రత్త పడ్డారు. నీటి సంరక్షణ చర్యల ఫలితంగా భూగర్భజలం పెరిగింది. న్యూస్‌టుడే, డోర్నకల్.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Yash: మరో రామాయణం సిద్ధం.. రాముడిగా రణ్‌బీర్, రావణుడిగా యశ్..!
-
Sports News
WTC Final: తొలి క్రికెటర్‌గా ట్రావిస్ హెడ్ ఘనత.. మొదటి రోజు ఆటలో రికార్డుల జోరు!
-
Crime News
Crime News: ముంబయిలో సహజీవన భాగస్వామిని ముక్కలు చేసి..ఆపై కుక్కర్లో ఉడికించి..!
-
General News
Harish Rao: అందుకే మన ‘మిషన్ కాకతీయ’ దేశానికే ఆదర్శం: హరీశ్‌రావు
-
India News
Wrestlers Protest: బ్రిజ్‌భూషణ్‌పై పోక్సో కేసులో ఆమె మైనర్ కాదా..? ఆమె తండ్రి ఏం చెప్పారంటే..?
-
Movies News
Shiva Balaji: జాతకాలు కుదరలేదని బ్రేకప్ చెప్పేసుకున్నాం..: శివ బాలాజీ