logo

రాష్ట్రంలో ఒక్కో పథకం ఒక్కో ఆణిముత్యం

ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక్కో సంక్షేమ పథకం ఒక్కో ఆణిముత్యంలా విరాజిల్లుతుందని స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజక వర్గం భారాస ఇన్‌చార్జిగా వచ్చిన ఎమ్మెల్సీ కోటిరెడ్డి అన్నారు.

Published : 01 Apr 2023 04:11 IST

ప్రసంగిస్తున్న ఎమ్మెల్సీ కోటిరెడ్డి, చిత్రంలో ఎమ్మెల్సీ పల్లా, ఎమ్మెల్యేలు రాజయ్య, వినయ్‌భాస్కర్‌

ధర్మసాగర్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక్కో సంక్షేమ పథకం ఒక్కో ఆణిముత్యంలా విరాజిల్లుతుందని స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజక వర్గం భారాస ఇన్‌చార్జిగా వచ్చిన ఎమ్మెల్సీ కోటిరెడ్డి అన్నారు. ధర్మసాగర్‌లో శుక్రవారం భారాస ఆత్మీయ సమ్మేళనాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ టి.రాజయ్య అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ కోటిరెడ్డి, అతిథులుగా ఎమ్మెల్సీ, రైతు బంధు రాష్ట్ర చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, భారాస హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌ హజరై మాట్లాడారు. ఎమ్మెల్సీ కోటిరెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సందేశాన్ని చదివి వినిపించారు. భారాస నాయకులు, కార్యకర్తలు ప్రజల కష్టాలను తెలుసుకుని, వారి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారన్నారు.సమావేశానికి కోలాటాలతో మహిళలు, డప్పు వాయిద్యాలతో భారీ ర్యాలీ తీసి, అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్‌ సుందర్‌రాజ్‌ యాదవ్‌, కార్పొరేటర్‌ ఆవాల రాధికారెడ్డి, ఎంపీపీ నిమ్మ కవిత, జడ్పీటీసీ సభ్యులు పిట్టల శ్రీలత, చాడ సరిత, సమావేశం ముగిసిన తర్వాత గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ గుండు సుధారాణి, ధర్మసాగర్‌ మండల పీఏసీఎస్‌ చైర్మన్‌ గున్‌రెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, భారాస మండల, జిల్లా నాయకులు హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని