logo

ధరణి పోర్టల్‌పై అభిప్రాయ సేకరణ

ధరణి పోర్టల్‌ నిర్వహణపై సాధిక్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం ములుగు జిల్లాలోని పలు మండలాల్లో రైతుల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు.

Published : 29 May 2023 03:16 IST

జగ్గన్నపేటలో రైతులతో మాట్లాడుతున్న సాధిక్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ సాధిక్‌ అలీ

ములుగు, న్యూస్‌టుడే: ధరణి పోర్టల్‌ నిర్వహణపై సాధిక్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం ములుగు జిల్లాలోని పలు మండలాల్లో రైతుల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. ఫౌండేషన్‌ ఛైర్మన్‌ సాధిక్‌ అలీ ములుగు మండలంలోని బండారుపల్లి, మదనపల్లి, జగ్గన్నపేట, వెంకటాపూర్‌ మండలంలోని కేశవాపూర్‌, నర్సాపూర్‌, గ్రామాల్లో ఆయన రైతులతో మాట్లాడారు. ధరణి వల్ల ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన చర్చించారు. సమస్యలు విని పరిష్కార మార్గాలు సూచించారు. ఇటీవల హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ప్రతులను రైతులకు అందించారు. పలువురు రైతులు ధరణిలో తమ పేరు రావడంలేదని, ఆన్‌లైన్‌లో కాకుండా ప్రత్యక్ష్యంగా కార్యాలయంలో దరఖాస్తు చేసుకునే విధంగా సౌకర్యం కల్పించాలని కోరారు. భూములను సర్వే చేసి హద్దులను నిర్ధారించాలని, సాదాబైనామా పట్టాలను కోర్టులో త్వరితగతిన పరిష్కారం చేయాలని రైతులు అభిప్రాయం వ్యక్తం చేశారు. రైతుల అభిప్రాయాలను సేకరించిన ఛైర్మన్‌ మాట్లాడుతూ రైతుల అభిప్రాయాలను రాష్ట్ర ప్రభుత్వానికి, హై కోర్టుకు అందజేస్తామని తెలిపారు. ఫౌండేషన్‌ సభ్యడు రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని