logo

వంతెన పనులు ప్రారంభం

మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల గ్రామం పద్మశాలీకాలనీలోని కట్టు కాలువపై వంతెన పనులకు ఎట్టకేలకు మోక్షం కలిగింది.

Published : 31 May 2023 05:03 IST

కుమ్మరికుంట్లలో చేపట్టిన కొత్త కల్వర్టు నిర్మాణ పనులు

దంతాలపల్లి, న్యూస్‌టుడే: మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల గ్రామం పద్మశాలీకాలనీలోని కట్టు కాలువపై వంతెన పనులకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఏనకుంట చెరువు నుంచి దిగువన ఉన్న పెద్దచెరువుకు వరదనీరు చేరేలా కట్టుకాలవపై పైపులు వేసి చిన్న వంతెన ఏర్పాటు చేశారు. గత ఏడాది జులై 23న కురిసిన భారీ వర్షంతో రహదారి, పైపులు పూర్తి దెబ్బతిన్నాయి. దీనిపై రాకపోకలు సాగించే భారీ వాహనాలకు ప్రమాదం పొంచి ఉందంటూ గత ఏడాది జులై 30వ తేదీన ‘భారీ వాహనం వెళ్తే...కుప్ప కూలుడే’ శీర్షికతో ‘ఈనాడు’ ప్రధాన సంచికలో కథనం ప్రచురితమైంది. నిధుల కొరత కారణంగా పునరుద్ధరణ పనుల్లో జాప్యం చోటు చేసుకుంది. ఎట్టకేలకు అధికారులు స్పందించారు. కొత్త వంతెన నిర్మాణానికి ప్రభుత్వం రూ. 32 లక్షల నిధులు మంజూరు చేసింది.  పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో వంతెన నిర్మాణ పనులను ప్రారంభించారు. దీంతో గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని