దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయండి
దశాబ్ది వేడుకలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రగతి భవనంలో వేడుకల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు.
భూపాలపల్లి కలెక్టరేట్, న్యూస్‌టుడే: దశాబ్ది వేడుకలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రగతి భవనంలో వేడుకల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామస్థాయి వరకు ప్రతి రోజు నిర్వహించే కార్యక్రమాలను ప్రజాప్రతినిధుల సమన్వయంతో కొనసాగించాలన్నారు. జూన్ 3న రైతు దినోత్సవం, 7న సాగునీటి దినోత్సవం, 8న ఊరూరా చెరువుల పండగ నిర్వహించాలన్నారు. రైతు వేదికలలో రైతు దినోత్సవాన్ని నిర్వహించాలని, వ్యవసాయశాఖ, ఎంపీడీవో, తహసీల్దార్ ఇతర అధికారులు అందరు పాల్గొనాలన్నారు. ఊరూరా చెరువుల పండగ సందర్భంగా ప్రతి గ్రామంలో నిర్వహించాలని, కార్యక్రమానికి వచ్చిన వారికి భోజన ఏర్పాట్లు చేయాలని, బతుకమ్మ, బోనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ముగ్గుల పోటీలు, చెరువు పూజలు చేయాలని వివరించారు. ప్రతి ఒక్క అధికారి దశాబ్ది ఉత్సవాల విజయవంతానికి కృషి చేయాలని లేని పక్షంలో కఠిన చర్యలు ఉంటాయని అధికారులను కలెక్టర్ హెచ్చరించారు. కార్యక్రమంలో డీఆర్డీవో పురుషోత్తం, మత్స్యశాఖ అధికారి అవినాశ్, డీపీవో ఆశాలత, మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు.
భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
భూపాలపల్లి క్రైం, న్యూస్‌టుడే: తెలంగాణ అవతరణ ఉత్సవాలు నిర్వహించే అంబేడ్కర్ క్రీడా మైదానాన్ని ఎస్పీ సురేందర్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. భద్రత ఏర్పాట్లు ఎలా ఉన్నాయో తిరిగి చూశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఆయన వెంట భూపాలపల్లి సీఐ రాంనర్సింహారెడ్డి, ఎస్సై రామకృష్ణ ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Rupert Murdoch: ‘ఫాక్స్’ ఛైర్మన్ బాధ్యతల నుంచి వైదొలిగిన మీడియా మొఘల్
-
Stomach Pain: కడుపు నొప్పితో ఆస్పత్రికి.. ‘ఎక్స్-రే’ చూస్తే షాక్!
-
World Cup: ఆ ఇద్దరూ ఉండటం వల్లే సంజూ శాంసన్‌ను ఎంపిక చేయలేదు: హర్భజన్ సింగ్
-
TDP: వైకాపా దౌర్జన్యాలను ఎలా ఎదుర్కొందాం? టీడీఎల్పీలో చర్చ
-
Flipkart: మరోసారి బిగ్ బిలియన్ డేస్ సేల్.. వాటిపై భారీ డిస్కౌంట్!
-
LEO Movie: పోస్టర్లతోనే ‘లియో’ కథను హింట్ ఇచ్చారా? ఆ జాబితాలోనూ నెం.1