logo

రైతులకు నాణ్యమైన విద్యుత్తు అందించండి

రాష్ట్రానికి అన్నం పెట్టే రైతన్నలకు నాణ్యమైన విద్యుత్తు అందించాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి దయాకర్‌రావు అన్నారు.

Published : 01 Jun 2023 03:26 IST

దేవరుప్పుల రూరల్‌, న్యూస్‌టుడే: రాష్ట్రానికి అన్నం పెట్టే రైతన్నలకు నాణ్యమైన విద్యుత్తు అందించాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి దయాకర్‌రావు అన్నారు. దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెంలో బుధవారం విద్యుత్తుశాఖ అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో మంత్రి మాట్లాడారు. వ్యవసాయానికి అందిస్తున్న ఉచిత విద్యుత్తుతో కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలన్నారు. నియోజకవర్గంలో కిందికి వేలాడుతున్న విద్యుత్తు తీగలను సరిచేయాలని, అవసరమైన చోట అదనపు నియంత్రికలను ఏర్పాటు చేయాలన్నారు. ధరావత్‌తండా, ధర్మాపురంలో మరణించిన భారాస కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. విద్యుత్తుశాఖ ఎస్‌ఈ వేణుమాధవ్‌, డీఈ మధుసూదన్‌, ఏడీఈలు చలపతి, శ్రీధర్‌, ఏఈ సుధాకర్‌, భారాస మండల అధ్యక్షుడు తీగల దయాకర్‌, సుందర్‌రాంరెడ్డి, బస్వ మల్లేశం, చింత రవి, సర్పంచి బిళ్ల అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.

కొడకండ్ల : పాలకుర్తి నియోజకవర్గం ఆధ్యాత్మిక రంగ అభివృద్ధిలో ముందంజలో ఉందని మంత్రి దయాకర్‌రావు అన్నారు. కొడకండ్ల మండలం మొండ్రాయిలో నిర్వహించిన బొడ్రాయి, ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులతో మాట్లాడారు. కోట్ల రూపాయలతో పాలకుర్తి, వల్మిడి, బమ్మెర ప్రాంతాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. దేవతల ఆశీర్వాదంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచి ఊర్మిళ, రైబస మండల కన్వీనర్‌ వెంకటేశ్వర్‌రావు, భారాస నాయకులు, వేదపండితులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని