logo

ప్రణాళికతో దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలి

దశాబ్ది ఉత్సవాలను పక్కా ప్రణాళికతో, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని, కార్యక్రమాలు పండగను తలపించాలని వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ అన్నారు.

Published : 02 Jun 2023 02:55 IST

మాట్లాడుతున్న ఎమ్మెల్యే నరేందర్‌

వరంగల్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: దశాబ్ది ఉత్సవాలను పక్కా ప్రణాళికతో, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని, కార్యక్రమాలు పండగను తలపించాలని వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ అన్నారు. హంటర్‌రోడ్డులోని ఓ వేడుకల మందిరంలో గురువారం జరిగిన ఉత్సవాల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఉత్సవాల గోడపత్రికలు, సీడీలను జిల్లా పాలనాధికారి ప్రావీణ్య, ఇతర అధికారులు, నాయకులతో కలిసి ఆవిష్కరించారు. 2న పతాకావిష్కరణతో ప్రారంభమై 22న అమరుల సంస్మరణతో ఉత్సవాలు ముగుస్తాయి. 2నుంచి రోజు వారిగా నిర్వహించే కార్యక్రమాల వివరాలను ఎమ్మెల్యే వెల్లడించారు. జిల్లా అధికారులు పూర్తిస్థాయిలో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. తెలంగాణ రైతురుణ విమోచన ఛైర్మన్‌ నాగుర్ల వెంకటేశ్వర్లు, మేయర్‌ గుండు సుధారాణి, మున్సిపల్‌ కమిషనర్‌ రిజ్వాన్‌ బాషా, అదనపు కలెక్టర్లు శ్రీవత్స, అశ్వినీ తానాజీ, డిప్యూటీ మేయర్‌ షమీమ్‌ మసూద్‌ పాల్గొన్నారు.


ధనమైసమ్మదేవి విగ్రహ ప్రతిష్ఠాపన

శివనగర్‌: శివనగర్‌లోని మెట్లబావి ధనమైసమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. తూర్పు ఎమ్మెల్యే నరేందర్‌ దంపతులు, మాజీ డిప్యూటీ మేయర్‌ ఎంబాడి రవీందర్‌ దంపతులు, కార్పొరేటర్‌ దిడ్డి కుమారస్వామి దంపతులు, భాజపా నాయకుడు గంటా రవికుమార్‌ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కమిటీ అధ్యక్షుడు బాబన్న, భక్తులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు