logo

ఖిలా వరంగల్‌లో పార్కింగ్‌ దోపిడీ!

వరంగల్‌ జిల్లాలో ప్రధాన పర్యాటక కేంద్రమైన ఖిలావరంగల్‌లో సందర్శకుల వద్ద వాహనాల పార్కింగ్‌ పేరిట దోపిడీ చేస్తున్నారు.

Published : 02 Jun 2023 02:55 IST

ఏకశిల చిల్డ్రన్స్‌ పార్క్‌ వద్ద నిలిపిన వాహనాలు

ఖిలావరంగల్‌, న్యూస్‌టుడే: వరంగల్‌ జిల్లాలో ప్రధాన పర్యాటక కేంద్రమైన ఖిలావరంగల్‌లో సందర్శకుల వద్ద వాహనాల పార్కింగ్‌ పేరిట దోపిడీ చేస్తున్నారు. నిత్యం దేశ, విదేశాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కాకతీయుల కాలంనాటి కట్టడాలు తిలకించేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ప్రస్తుతం వేసవి సెలవుల నేపథ్యంలో సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇదే అదనుగా ఇక్కడి నిర్వాహకులు వాహనాలు నిలిపితే చాలు పార్కింగ్‌ రుసుం వసూలు చేస్తున్నారు. ద్విచక్ర వాహనానికి రూ.10, కారుకు రూ.30, బస్సుకు రూ.50 చొప్పున ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. కనీసం రసీదు ఇవ్వడం లేదు.

అనుమతి లేకున్నా.. : కేంద్ర పురావస్తు శాఖ సంరక్షణలోని పురాతన కట్టడాలు తిలకించే వారికి ఎటువంటి వాహనాల పార్కింగ్‌ లేకున్నా..వసూళ్లకు పాల్పడుతున్నారు. కుడా ఆధ్వర్యంలో రూ.50 లక్షలతో ప్రత్యేక పార్కింగ్‌ స్థలం ఏర్పాటు చేసినా.. వసూళ్లే లక్ష్యంగా నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్‌ చేయిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  కుడా నిర్వహణలో ప్రైవేటు గుత్తేదారు నడుపుతున్న ఏకశిల చిల్డ్రన్స్‌ పార్క్‌లోకి వెళ్లాలంటే ఒక్కొక్కరికి రూ.20 ప్రవేశ రుసుం, కారు పార్కింగ్‌కు రూ.30 వసూలు చేస్తున్నారు.

ద్విచక్రవాహనదారుడికి రసీదు ఇవ్వకుండా నగదు తీసుకుంటున్న సిబ్బంది

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు