నిధులు రాక.. పనులు సాగక!
మహబూబాబాద్ పురపాలక సంఘంలో అభివృద్ధి పనులు ఆశించిన విధంగా వేగంగా పూర్తి కావడం లేదు.
పట్టణంలోని సిగ్నల్ కాలనీలో ప్రారంభించని మురుగు కాలువ
మహబూబాబాద్, న్యూస్‌టుడే: మహబూబాబాద్ పురపాలక సంఘంలో అభివృద్ధి పనులు ఆశించిన విధంగా వేగంగా పూర్తి కావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా పనులకు నిధులు మంజూరు చేస్తున్నా కొందరు గుత్తేదారులు ముందుకు రావడం లేదు. టెండర్లు దక్కించుకున్నవారిలో కొందరు పనులు ప్రారంభించడం లేదు. పనులు చేసిన గుత్తేదారులకు సకాలంలో బిల్లులు చెల్లించడం లేదనే ఆరోపణలున్నాయి. ట్రెజరీకి చెక్కులు పంపించినా బిల్లులు పాస్ కావడం లేదంటూ పలువురు ఆందోళన చెందుతున్నారు. అంచనాలు కూడా ప్రస్తుత ముడిసరకుల ధరల కంటే తక్కువగా ప్రతిపాదిస్తుండడంతో టెండర్లు వేసేందుకు కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదు. దీంతో అధికారులు ఒక్కో పనికి రెండు, మూడు పర్యాయాలకంటే ఎక్కువగా టెండర్లు ఆహ్వానించాల్సి వస్తోంది. ఫలితంగా అభివృద్ధి నిధుల పనులు పడకేస్తున్నాయి. పట్టణంలో 2023 మార్చి వరకు వివిధ పథకాల ద్వారా మంజూరైన నిధులు నిలిచిపోయిన పనులపై ‘న్యూస్‌టుడే’ అందిస్తున్న కథనం.
పలుమార్లు టెండర్లు వేసిన పనుల్లో కొన్ని..
* మహబూబాబాద్ పట్టణంలోని సాలార్ తండాల్లో పట్టణ ప్రగతి నిధులు రూ. 10 లక్షల వ్యయంతో నిర్మాణం చేయనున్న వైకుంఠధామం పనులకు నాలుగు సార్లు టెండర్లు ఆహ్వానించారు.
* పట్టణంలోని 22వ వార్డు పరిధిలో హనుమాన్ టెంపుల్ ఎదురుగా సీసీ రోడ్డు నిర్మాణానికి రూ. 1.50 లక్షలు మంజూరు కాగా టెండర్ వేసేందుకు ముందుకు రావడం లేదు.
* పట్టణంలోని 31వ వార్డులో 14వ ఆర్థిక సంఘం నుంచి సీసీ రోడ్డు నిర్మాణానికి రూ. 5 లక్షలు మంజూరు కాగా రెండు సార్లు టెండర్లు నిర్వహించారు.
పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం
- సీహెచ్.ఉపేందర్, డీఈ పురపాలక సంఘం, మహబూబాబాద్
టెండర్ల ప్రక్రియ పూర్తైన పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కొందరు టెండర్లు వేసి వివిధ కారణాలతో పనులు చేసేందుకు ముందుకు రాకపోవడంతో వాటిని రద్దు చేసి మళ్లీ ఆహ్వానిస్తున్నాం. చేసిన పనులకు ప్రభుత్వం నిధులు విడుదల చేయగానే గుత్తేదారులకు బిల్లులు చెల్లిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Hyderabad: చింతల్‌బస్తీ నాలాలో మొసలి పిల్ల.. భయాందోళనలో స్థానికులు
-
Guntur: తెదేపా మహిళా నేత అరెస్టు.. పోలీసుల తీరును తప్పుబట్టిన న్యాయమూర్తి
-
Shah Rukh Khan: ‘మీ సొట్టబుగ్గపై ముద్దు పెట్టుకోవచ్చా?’.. ఆసక్తికర రిప్లై ఇచ్చిన షారుక్
-
Parvathipuram Manyam: లోయలో పడిన ద్విచక్ర వాహనం.. ముగ్గురి మృతి
-
CBI: అమిత్ షా భరోసా ఇచ్చారు.. సీబీఐ దర్యాప్తు షురూ: సీఎం బీరెన్ సింగ్
-
Hyderabad Metro: గణేశ్ నిమజ్జనం.. మెట్రో రైలు ప్రత్యేక ఏర్పాట్లు