భారాసతోనే అభివృద్ధి సాధ్యం
రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా మారిందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విమర్శించారు.
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కడియం శ్రీహరి
స్టేషన్‌ఘన్‌పూర్, న్యూస్‌టుడే : రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా మారిందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విమర్శించారు. మండల కేంద్రంలో గరువారం నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన 50 మంది లబ్ధిదారులకు రూ.1,99,3500 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పండగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని, పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తొమ్మిదేళ్లలో సాధించిన ప్రగతిని ఈ ఉత్సవాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. భాజపా, కాంగ్రెస్ పార్టీలతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని చెప్పారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం చేసిన దాఖలాలు లేవని, రాష్ట్రం పట్ల తీవ్రమైన వివక్షను చూపుతోందని చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే అభివృద్ధిని మర్చి దోచుకోవడమే పనిగా రాజకీయాలు చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో భారాసతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని చెప్పారు. అనంతరం మండలంలోని చాగల్లు గ్రామంలో పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భక్త మార్కండేయ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు నరేందర్‌రెడ్డి, జిల్లా నాయకులు బెలిదే వెంకన్న, రాంబాబు, తీగల కరుణాకర్‌రావు, యాదగిరి మాధుసూదన్ రెడ్డి, రాజేశ్ నాయక్, సర్పంచులు లింగరెడ్డి, రవీందర్, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Hyderabad: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ నూతన ఛైర్మన్‌గా బక్కి వెంకటయ్య
-
Sai Rajesh: నా సాయం పొందిన వ్యక్తే నన్ను తిట్టాడు: ‘బేబీ’ దర్శకుడు
-
TTD: సర్వభూపాల వాహనంపై శ్రీనివాసుడు.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
Weather Report: తెలంగాణలో రాగల 3 రోజులు తేలికపాటి వర్షాలు
-
Military Tank: సైనిక శిక్షణ కేంద్రంలో మాయమై.. తుక్కులో తేలి!
-
Chandrayaan 3: జాబిల్లిపై సూర్యోదయం.. విక్రమ్, ప్రజ్ఞాన్‌లతో కమ్యూనికేషన్‌కు ఇస్రో ప్రయత్నాలు