మోదీ హయాంలో అభివృద్ధి పరుగులు
తొమ్మిదేళ్లలో కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ పాలన, రాష్ట్రంలోని కేసీఆర్ పాలనను పోల్చుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకంటే కేంద్రంలోని సంక్షేమ పథకాలే అధికంగా ప్రజలకు ప్రయోజనం కలిగిస్తున్నాయని జమ్ము కశ్మీర్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి నిర్మల్‌సింగ్ అన్నారు.
మాట్లాడుతున్న జమ్ము కశ్మీర్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్
మహబూబాబాద్, న్యూస్‌టుడే: తొమ్మిదేళ్లలో కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ పాలన, రాష్ట్రంలోని కేసీఆర్ పాలనను పోల్చుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకంటే కేంద్రంలోని సంక్షేమ పథకాలే అధికంగా ప్రజలకు ప్రయోజనం కలిగిస్తున్నాయని జమ్ము కశ్మీర్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి నిర్మల్‌సింగ్ అన్నారు. భాజపా నిర్వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గ మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మహబూబాబాద్‌కు వచ్చిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రధాని మోదీ చేసిన అభివృద్ధి కంటే కేసీఆర్ ఏమైనా ఎక్కువ చేశారా? అని ప్రశ్నించారు. అరవై ఏళ్లుగా దేశంలో జరగని అభివృద్ధి మోదీ ప్రధాని పదవి చేపట్టిన తర్వాత జరిగిందన్నారు. దేశంలో ఉగ్రవాదం, తీవ్రవాదం తగ్గిపోయిందన్నారు. జమ్ము, కశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ను రద్దు చేసిన తర్వాత ప్రశాంతత నెలకొందన్నారు. అంతకుముందు ఎంతో మంది పౌరులు మరణించారని అందులో తన సోదరుడు కూడా ఉన్నారన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంట్‌లో భాజపా నేత సుష్మాస్వరాజ్ కృషి ఎంతో ఉందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం అవినీతి కుంభకోణాల్లో మునిగిపోయిందని ఆరోపించారు. ఆయన కూతురు కవిత దిల్లీ మద్యం కేసులో రూ. 60 వేల కోట్ల అవినీతి కేసులో చిక్కుకుందని ఆరోపించారు. గిరిజన జిల్లా మహబూబాబాద్ అన్ని రంగాల్లో వెనకబడిందన్నారు. భాజపా డబుల్ ఇంజన్ సర్కారు వస్తే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. సమావేశంలో భాజపా గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జాటోతు హుస్సేన్‌నాయక్, జిల్లా అధ్యక్షుడు వి.రామచందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, జిల్లా నాయకులు యాప శీతయ్య, వెంకటేశ్వర్లు, మహేష్, ఎం.శశివర్థన్‌రెడ్డి, మురళి, శ్యాంసుందర్, సతీష్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/09/23)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Damini bhatla: ఊహించని ట్విస్ట్.. బిగ్‌బాస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్
-
Sudhamurthy: నా పేరును దుర్వినియోగం చేస్తున్నారు.. పోలీసులకు సుధామూర్తి ఫిర్యాదు
-
Raghava Lawrence: ఆయన లేకపోతే ఈ వేదికపై ఉండేవాణ్ని కాదు: లారెన్స్
-
Mla Rajaiah: కాలం నిర్ణయిస్తే బరిలో ఉంటా: ఎమ్మెల్యే రాజయ్య