అభివృద్ధికి నవశకం!!
స్వరాష్ట్రం సాకారమైన తొమ్మిదేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతో హనుమకొండ జిల్లా సర్వతో ముఖాభివృద్ధి చెందిందని, ప్రగతి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో సబ్బండ వర్గాలకు మెరుగైన పాలన అందించామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు.
సీఎం చొరవతో అన్ని రంగాల్లో అద్భుతాలు
చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్
జెండా ఆవిష్కరించి వదంనం చేస్తున్న చీఫ్‌విప్ వినయ్‌భాస్కర్, సీపీ రంగనాథ్, కలెక్టర్ సిక్తా పట్నాయక్ తదితరులు
ఈనాడు, వరంగల్, హనుమకొండ కలెక్టరేట్, న్యూస్‌టుడే: స్వరాష్ట్రం సాకారమైన తొమ్మిదేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతో హనుమకొండ జిల్లా సర్వతో ముఖాభివృద్ధి చెందిందని, ప్రగతి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో సబ్బండ వర్గాలకు మెరుగైన పాలన అందించామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. శుక్రవారం హనుమకొండ జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన వినయ్‌భాస్కర్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి, జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. నగర మేయర్ సుధారాణి, కలెక్టర్ సిక్తా పట్నాయక్, సీపీ రంగనాథ్, జడ్పీ ఛైర్మన్ డాక్టర్ సుధీర్‌బాబు ప్రజాప్రతినిధులు, అధికారులు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినయ్‌భాస్కర్ ప్రసంగ పాఠం ఆయన మాటల్లోనే..
వ్యవసాయం కళకళ: రాష్ట్రంలోని వ్యవసాయ విధానాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు అందిస్తున్నాం. రైతు బంధుతో పెట్టుబడి సాయాన్ని, రైతు బీమాతో రైతులకు భరోసా కల్పించాం. ఇప్పటి వరకు 1,36,325 మంది రైతులకు రూ. 1170 కోట్లు పంట పెట్టుబడి సాయంగా అందించాం. 1887 మంది కుటుంబాలకు రూ. 94.35 కోట్ల బీమా సాయం అందించాం. జిల్లాలో 55 రైతు వేదికలు, 178 రైతుబంధు సమితులను ఏర్పాటు చేశాం.
విద్యకు పెద్దపీట: రాష్ట్రం సిద్ధించాక విద్యకు పెద్దపీట వేస్తున్నాం. ‘మన ఊరు మన బడి’, ‘మన బస్తీ మన బడి’ పథకాలతో 176 పాఠశాలలను కార్పొరేట్ హంగులతో తీర్చిదిద్దాం. ఇందుకు రూ. 85 కోట్లు అంచనాలను రూపొందించాం.
ఆరోగ్యమస్తు: వైద్య రంగాన్ని ఎంతో మెరుగుపరిచాం. ‘కంటి వెలుగు’ కార్యక్రమం కింద జిల్లాలో ఇప్పటి వరకు రెండు విడతల్లో 4.23 లక్షల మందికి పరీక్షలు నిర్వహించాం. 61 వేల మందికి అద్దాలు పంపిణీ చేశాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 5 ఆరోగ్య మహిళా క్లినిక్‌లను ప్రారంభించాం. జిల్లాలో 63 పల్లె దవాఖానాలు, 3 బస్తీ దవాఖానాలు ఏర్పాటయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగిన 38,432 ప్రసవాలకు కేసీఆర్ కిట్లు అందజేశాం. ఇందుకు రూ. 33.94 కోట్లు వెచ్చించాం.
కార్మికులకు అండగా: కార్మికుల కోసం బీమా అమలు చేస్తున్నాం. ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ. 6.30 లక్షలు, శాశ్వత వైకల్యానికి రూ. 5 లక్షలు అందజేస్తున్నాం. సాధారణ మరణానికి రూ. 1.30 లక్షలు అందిస్తున్నాం.
* క్రీడల్లో జిల్లా ప్రత్యేక గుర్తింపు పొందింది. రూ. 7 కోట్ల విలువ గల 400 మీటర్ల సింథటిక్, అథ్లెటిక్ ట్రాక్ ‘ఖేలో ఇండియా’ పథకం ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చాం. సీఎం కప్ పోటీల్లో జిల్లాలో 1710 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
పేదలకు తోడుగా: అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాలను క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో 58 తీసుకొచ్చింది. జిల్లాలో 714 దరఖాస్తులు రాగా, పరిశీలించి 384 పట్టాలు జారీ చేశాం. జీవో 59 కింద 75 దరఖాస్తులు ఆమోదించగా 37 మంది వందశాతం డబ్బులు చెల్లించారు.
దళితబంధు: దళితబంధు ద్వారా దళితులకు రూ. 10 లక్షలను ఉచితంగా అందిస్తున్నాం. అర్హులైన 38,323 మందిని గుర్తించి వారికి రూ. 3832 కోట్లను అందించాం.
అన్ని వర్గాలకు ఆసరా: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా 18,981 లబ్ధిదారులకు రూ. 170.86 కోట్లను అందించాం.
* పశుసంవర్ధక శాఖ ద్వారా 13740 గొర్రెల యూనిట్లు పంపిణీ చేశాం. మత్స్యశాఖ ద్వారా ఉచిత చేప పిల్లల పంపిణీ వందశాతం రాయితీతో 3086 చెరువులు, కుంటల్లో 896 లక్షల చేప పిల్లల్ని విడుదల చేశాం.
పట్టణాభివృద్ధి: కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ద్వారా పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నాం. భద్రకాళి బండ్, జైన్ మందిర్, సరిగమ పార్కు, ఇతర పార్కులను అభివృద్ధి చేశాం. రూ. 30 కోట్ల నిధులతో భద్రకాళి మాడవీధుల్ని నిర్మిస్తున్నాం.
స్మార్ట్‌సిటీ తళకులు
స్మార్ట్‌సిటీ పథకంలో భాగంగా రూ.948.55 కోట్లతో 62 అభివృద్ధి పనులు చేపట్టగా, అందులో స్మార్ట్ రోడ్లు, భద్రకాళి బండ్‌లను, పార్కులు సెంట్రల్ లైటింగ్, గ్రంథాలయాలను, పబ్లిక్ గార్డెన్స్ నవీకరణ, వీధిదీపాలు, ఫుట్పాత్‌ల ఏర్పాటు పూర్తి చేశాం. 11.52 లక్షల మొక్కలను నాటాం.
ఆహార భద్రత
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారి కోసం 2.28 లక్షల ఆహార భద్రత కార్డులు జారీ చేశాం. 110 సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు సన్న బియ్యంతో పాటు ఆరు వందల పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ద్వారా నాణ్యమైన సన్న బియ్యం అందించి వారి పౌష్టిక అభివృద్ధి చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో ఇప్పటి యాసంగి సీజన్‌లో 669 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 98.22 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశాం. ఇందుకుగానూ రూ. 4,403 కోట్లను రైతులకు ఆన్‌లైన్ ద్వారా చెల్లించాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Bombay HC: ఔషధాల కొరతతో మరణాలా..? ఆసుపత్రుల్లో మృత్యుఘోషపై బాంబే హైకోర్టు సీరియస్
-
Anitha: అప్పుడు నష్టాలు చూశా.. ఒత్తిడికి లోనయ్యా: అనితా చౌదరి
-
Pawan Kalyan: జగన్‌ది రూపాయి పావలా ప్రభుత్వం: పవన్ కల్యాణ్
-
Karnataka: ఇలాగే వదిలేస్తే కర్ణాటకలో కసబ్, లాడెన్ ఫొటోలు ప్రదర్శిస్తారు: భాజపా నేత సీటీ రవి
-
Asian Games: ఆసియా క్రీడలు.. నీరజ్‌కు స్వర్ణం, కిశోర్‌కు రజతం
-
Chandrababu Arrest: ఆంక్షలు దాటి, పోలీసుల కళ్లు కప్పి.. ర్యాలీకి ఎమ్మెల్యే కోటంరెడ్డి