logo

దశాబ్ది ఉత్సవాల స్ఫూర్తితో ముందడుగు

కొన్నేళ్లుగా అభివృద్ధిలో దూసుకెళ్తున్నామని.. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుదామని భూపాలపల్లి సింగరేణి జీఎం బళ్లారి శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Published : 03 Jun 2023 04:36 IST

అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచుతున్న జీఎం శ్రీనివాసరావు

కోల్‌బెల్ట్‌, న్యూస్‌టుడే: కొన్నేళ్లుగా అభివృద్ధిలో దూసుకెళ్తున్నామని.. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుదామని భూపాలపల్లి సింగరేణి జీఎం బళ్లారి శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు సింగరేణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా జీఎం హాజరై ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. అంబేడ్కర్‌, జయశంకర్‌ విగ్రహాలకు పూలమాల వేశారు. అనంతరం తెలంగాణ రన్‌ ప్రారంభించారు. అక్కడి నుంచి తెలంగాణ దూందాం గేయాలతో అధికారులు, ఉద్యోగులు, కార్మికులు నృత్యాలు చేసుకుంటూ జీఎం కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ జీఎం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడ్డాక కొత్త ప్రాజెక్ట్‌లను ప్రారంభించుకున్నామని తెలిపారు. బొగ్గు ఉత్పత్తి రోజురోజుకు పుంజుకుంటోందని తెలిపారు. ఉత్సవాల్లో ఎస్వోటూ జీఎం వెంకటయ్య, ఏజీఎం రామలింగం, ఏజెంట్లు ఎన్‌వీ రావు, వెంకట్రాంరెడ్డి, పీఎం తుకారాం, ఫైనాన్స్‌ మేనేజర్‌ సురేఖ, సీపీవో శ్యాంప్రసాద్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని