logo

సేంద్రియ పద్ధతిలో సాగు మేలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ములుగులో శనివారం రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎడ్లబండ్లకు బెెలూన్లు అమర్చి  వాటితో ర్యాలీ నిర్వహించారు.

Published : 04 Jun 2023 05:19 IST

మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య

ములుగు, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ములుగులో శనివారం రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎడ్లబండ్లకు బెెలూన్లు అమర్చి  వాటితో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. డీఆర్‌వో రమాదేవి, ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి ఎడ్లబండి ఎక్కి ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ప్రవేశ పెట్టిన పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. రైతులు ఈ వర్షాకాలంలో రసాయన ఎరువులను తగ్గించి సేంద్రియ ఎరువులతో ఎక్కువ పంటలు పండించి అధిక డిగుబడులు వచ్చేలా కృషి చేయాలని కోరారు. రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. డీఆర్‌వో రమాదేవి మాట్లాడుతూ.. వ్యవసాయ అధికారులు రైతులకు సాగుపై ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు చేయాలన్నారు. ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుల పట్ల ఎంతో ప్రేమ చూపుతున్నారని తెలిపారు. తహసీల్దారు సత్యనారాయణ స్వామి. మండల ఏవో ఎం.సంతోష్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ మండల కో-ఆర్డినేటర్‌ కేశెట్టి కుటుంబరావు, మండల ఉద్యానశాఖాధికారి కళ్యాణి, రైతులు, మహిళా రైతులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

ఏటూరునాగారం, న్యూస్‌టుడే: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను రైతులు వినియోగించుకోవాలని, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఐటీడీఏ పీవో అంకిత్‌ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండలంలో క్లస్టరు స్థాయి రైతు దినోత్సవ వేడుకలు ఏటూరునాగారం, శంకరాజ్‌పల్లి రైతు వేదికల్లో ఘనంగా నిర్వహించారు. ఏటూరునాగారంలో ముఖ్యఅతిథిగా ఐటీడీఏ పీవో అంకిత్‌ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రైతు సంక్షేమ పథకాలైన రైతుబంధు, రైతు బీమా పథకాల గురించి వివరించారు. మండల స్పెషల్‌ అధికారి ప్రసునారాణి, ఏడీఏ శ్రీధర్‌, ఐటీడీఏ ఏపీవో వసంతరావు, ఎంపీపీ అంతటి విజయ, జిల్లా కోఅప్షన్‌ సభ్యులు వలియాబి, సర్పంచులు రామూర్తి, శకుంతల, కృష్ణ, ఎంపీటీసీ సభ్యులు లక్ష్మీనారాయణ, శ్రీలత, సర్పంచి సమత, ఎంపీడీవో కుమార్‌, ఏవో వేణగోపాల్‌, తదితరులు పాల్గొన్నారు.

కన్నాయిగూడెం: కన్నాయిగూడెంలో నిర్వహించిన కార్యక్రమానికి పీవో హాజరయ్యారు. గ్రంథాయల సంస్థ ఛైర్మన్‌ గోవింద్‌నాయక్‌, రైసస అధ్యక్షుడు బుచ్చయ్య, ఎస్సై సురేష్‌కుమార్‌, ఎంపీడీవో ఫణీంద్ర, ఏవో జయసింగ్‌, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

కన్నాయిగూడెంలో ప్రసంగిస్తున్న పీవో అంకిత్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు