logo

సుర్రుమంటున్న సూరీడు!

భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు.. రోజు, రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Published : 04 Jun 2023 05:36 IST

న్యూస్‌టుడే, మహబూబాబాద్‌, నెహ్రూసెంటర్‌ : భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు.. రోజు, రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ ఏడాది వేసవి సీజన్‌లో తొలిసారిగా శనివారం జిల్లాలోని నర్సింహులపేట మండలం పెద్ద నాగారంలో 46 సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలో నమోదైంది. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం తాడ్వాయి హట్స్‌లో కూడా 46 సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రత నమోదైంది. జయశంకర్‌ జిల్లా మహదేవ్‌పూర్‌లో 45.5 సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రత నమోదైంది. పది రోజులుగా జిల్లాలో రెండు, మూడు సెంటిగ్రేడ్ల వ్యత్యాసంలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణంలో కలిగిన మార్పులతో ఒక రోజు వాతావరణం చల్లబడినా మళ్లీ రెండు రోజుల నుంచి ఎండలు దంచికొడుతున్నాయి. సూరీడు తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తుండగా ఉదయం పది గంటల నుంచే ప్రధాన వీధుల్లో జనసంచారం తగ్గుతోంది. 12 గంటల వరకు జనసంచారం లేక వీధులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. కొన్ని దుకాణాలను కూడా మూసివేస్తున్నారు. శనివారం సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఎండ వేడి తగ్గలేదు.

జిల్లా కేంద్రంలో అండర్‌బ్రిడ్జి రోడ్డు వద్ద..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని