కాజీపేటలో రైల్వే అధికారుల అప్రమత్తం
ఒడిశా రాష్ట్రంలో జరిగిన ప్రమాదం నేపథ్యంలో కాజీపేట సబ్ డివిజన్ పరిధిలో రైల్వే అధికారులు అప్రమత్తం అయ్యారు.
రైలు పట్టాలను సరిచేస్తున్న సిబ్బంది
కాజీపేట, న్యూస్‌టుడే: ఒడిశా రాష్ట్రంలో జరిగిన ప్రమాదం నేపథ్యంలో కాజీపేట సబ్ డివిజన్ పరిధిలో రైల్వే అధికారులు అప్రమత్తం అయ్యారు. గత మూడు రోజులుగా అన్ని స్టేషన్లలో పట్టాలను సరిచేసే పనిలో నిమగ్నం అయ్యారు. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలను సరిచేస్తున్నారు. ఏదైనా సాంకేతిక లోపాలుంటే గమనించి వాటిని సికింద్రాబాద్‌లోని అధికారులకు నివేదిస్తున్నారు. ముఖ్యంగా రైల్వే స్టేషన్లలో లూప్‌లైన్లోకి వెళ్లే రైలు పట్టాల(పాయింట్లు)ను సరిచేస్తున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉంటూ.. నైపుణ్యం లేని సిబ్బందిని గుర్తించి, వారిని ఇతర పనులు అప్పగించే విధంగా యోచిస్తున్నారు. ఆపరేటింగ్, లోకోరన్నింగ్ విభాగాల్లో పనిచేసే సిబ్బందికి కంటి పరీక్షలు, వారి మానసిక స్థితిని కూడా సరిగా చూసుకోవాలని సూచిస్తున్నారు. కాజీపేట పరిధిలో ఆగకుండా పోయే రైళ్లు కొన్నే ఉంటాయి. కానీ ఉప్పల్, చింతలపలి, పెండ్యాల వంటి చిన్న స్టేషన్లలో రైళ్లు నేరుగా వేగంగా వెళ్తుండటంతో ఇక్కడ పనిచేసే సిబ్బంది చాలా అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి చిన్న సాంకేతిక లోపం ఉన్నా ఉన్నతాధికారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసి సరిచేసుకోవాల్సిన బాధ్యత అక్కడి ఉద్యోగిదేనని అధికారులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sapta Sagaralu Dhaati Movie Review: రివ్యూ: సప్త సాగరాలు దాటి - సైడ్ ఎ
-
Congress: జగన్ నిరంకుశ పాలనకు ఇది నిదర్శనం: గిడుగు రుద్రరాజు
-
NCP : శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయండి.. స్పీకర్ను కోరిన అజిత్ మద్దతుదారులు
-
Weather Report: తెలంగాణలో 3రోజుల పాటు వర్షాలు
-
Flight Fares: భారత్-కెనడాల మధ్య ఉద్రిక్తతలు.. విమాన టికెట్ ధరలకు రెక్కలు
-
Jaane Jaan Review: రివ్యూ: జానే జాన్.. కరీనా తొలి ఓటీటీ మూవీ మెప్పించిందా?