logo

‘ఉత్తర తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఉద్యమించాలి’

వరంగల్‌ జిల్లా కేంద్రాన్ని రాజధానిగా ప్రకటించాలని ఉత్తర తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్‌ ఏకు తిరుపతి డిమాండ్‌ చేశారు.

Published : 08 Jun 2023 04:52 IST

మాట్లాడుతున్న ఉత్తర తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రొఫెసర్‌ ఏకు తిరుపతి

భూపాలపల్లి, న్యూస్‌టుడే: వరంగల్‌ జిల్లా కేంద్రాన్ని రాజధానిగా ప్రకటించాలని ఉత్తర తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్‌ ఏకు తిరుపతి డిమాండ్‌ చేశారు. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం ప్రాంతాలతో పాటు గోదావరి తీరప్రాంతమైన మహారాష్ట్రలోని కొన్ని జిల్లాలను కలుపుకొని, ఆర్టికల్‌-3 ప్రకారం ఉత్తర తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. భూపాలపల్లి పట్టణంలోని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ఉత్తర తెలంగాణ రాష్ట్ర సమితి సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనేక ఖనిజ వనరులున్న ఉత్తర తెలంగాణ జిల్లాలు దోపిడీకి గురవుతున్నాయని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఉత్తర తెలంగాణ జిల్లాలకు మాత్రమే సాగు, తాగునీటి కోసం సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి బొగ్గు గనులను ఆంధ్రప్రదేశ్‌ ప్రాంత గుత్తేదారులకు అప్పగిస్తూ.. ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి లేకుండా చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో నాయకులు జోగుల సమ్మయ్య, పి.కిరణ్‌, చల్లూరి మధు, దేవేందర్‌, లింగారెడ్డి, కె.సమ్మయ్య, సీహెచ్‌.శంకర్‌, తిరుపతి, శేఖర్‌ (నానీ), రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని