9న సంక్షేమ సంబురాలు నిర్వహించాలి
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 9న సంక్షేమ సంబురాలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు.
మాట్లాడుతున్న కలెక్టర్ సిక్తా పట్నాయక్
హనుమకొండ కలెక్టరేట్, న్యూస్‌టుడే : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 9న సంక్షేమ సంబురాలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కులవృత్తినే నమ్ముకొని జీవనం పొందుతున్న వారికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందించేందుకు ఈనెల 20లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఇందులో భాగంగా మండలానికి 10 మంది చొప్పున, జిల్లా కేంద్రంలో 50 మందిని ఎంపిక చేసి చెక్కులు అందించాలన్నారు. ఇది నిరంతర ప్రక్రియ అన్నారు. బీసీ సంక్షేమాధికారి పుష్పలత, డీఆర్‌డీవో శ్రీనివాస్‌కుమార్, వివిధ మండలాలకు చెందిన ఎంపీడీవోలు పాల్గొన్నారు.
నేడు చెరువుల పండగ: హనుమకొండ కలెక్టరేట్: జిల్లా వ్యాప్తంగా గురువారం చెరువుల పండుగ నిర్వహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో అధికారులతో ఆమె మాట్లాడారు. చెరువుల చుట్టూ అందంగా తీర్చిదిద్దాలని, లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. బతుకమ్మ, బోనాలతో ర్యాలీలు నిర్వహించాలన్నారు. చెరువుల వద్ద ప్రజలు సహాపంక్తి భోజనాలు చేయాలన్నారు.
పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: హనుమకొండ కలెక్టరేట్: జిల్లాలో ఈనెల 11న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. ఇందుకోసం 11 రూట్లను ఏర్పాటు చేశామన్నారు. 21,036 అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Kishan Reddy: ఉద్యోగాలు భర్తీ చేయకుండా కేసీఆర్ కుట్ర: కిషన్‌రెడ్డి
-
iPhone 15: ఐఫోన్ 15 కొనబోతున్న ఎలాన్ మస్క్.. ఏం నచ్చిందో చెప్పిన బిలియనీర్!
-
China: చైనాలో జనాభా సంఖ్య కంటే ఖాళీ ఇళ్లే ఎక్కువ..!
-
Visakhapatnam: విరిగిపడిన కొండచరియలు.. కేకే లైన్లో ఏడు రైళ్ల నిలిపివేత
-
Pinarayi Vijayan: ‘అందుకే.. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారు’
-
Mann ki Baat: ప్రపంచ వాణిజ్యానికి అది ఆధారంగా నిలుస్తుంది: ప్రధాని మోదీ